బిగ్‌బాస్‌3కి రెఢీ

  • IndiaGlitz, [Friday,May 10 2019]

లోక నాయకుడు క‌మ‌ల్‌హాస‌న్ లోక్‌స‌భ ఎన్నిక‌లు త‌ర్వాత సినిమాల‌తో, టీవీ ప్రోగ్రామ్‌ల‌తో బిజీగా మారిపోతున్నారు ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించాల్సిన 'ఇండియ‌న్ 2' కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. శంక‌ర్‌కు, నిర్మాత‌ల‌కు మ‌ధ్య బ‌డ్జెట్ విష‌యంలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే క‌మ‌ల్‌హాస‌న్ మాత్రం ఈ గ్యాప్‌లో 'బిగ్‌బాస్‌3'కు సిద్ధ‌మవుతున్నారు.

ఇంత‌కు ముందు రెండు సీజ‌న్స్‌కు కూడా క‌మ‌ల్‌హాస‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. 'బిగ్‌బాస్ 3'కి సంబంధించిన ప‌నులు పూర్తి చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ప్రోమోస్ చిత్రీక‌ర‌ణ‌లో క‌మ‌ల్ పాల్గొన‌బోతున్నారు. జూన్‌నాటికి త‌మిళంలో బిగ్‌బాస్ సీజ‌న్ 3 మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.