మరో మల్టీస్టారర్‌కు రెడీ!

  • IndiaGlitz, [Saturday,January 05 2019]

జయాపజయాలతో సంబంధం లేకుండా మణిరత్నం రూపొందించే సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఆయన సినిమా చేస్తున్నారంటే అది ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూసే అభిమానులు కూడా ఆయనకు ఎక్కువే. ఆయన దర్శకత్వంలో ఎన్నో దృశ్యకావ్యాలు తెరకెక్కాయి. ఈమధ్యకాలంలో ఆయన చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని నిరాశ పరిచాయి. అయితే ఆమధ్య వచ్చిన ‘నవాబ్’తో మరోసారి తన మార్క్‌ను చాటుకున్నారు మణిరత్నం. ఇప్పుడు మరో మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇంతకు ముందే చేయాలనుకున్న ‘ఒన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని ఇప్పుడు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు విజయ్, మహేశ్‌బాబు, ఐశ్వర్యరాయ్‌లాంటి స్టార్స్‌తో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు బడ్జెట్ కారణాల వల్ల డ్రాప్ అయ్యింది. అదే కథతో ఇప్పుడు విక్రమ్, శింబు, జయంరవి హీరోలుగా సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఇందులో ప్రత్యేకం ఏమిటంటే బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ను, ఆయన కోడలు, అందాలరాశి ఐశ్వర్యరాయ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే మణిరత్నం అమితాబ్‌ను కలిసి కథ వినిపించినట్లు తెలిసింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

More News

ఆస‌క్తిక‌రంగా న‌య‌న‌తార 'ఐరా'

కోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార మ‌హిళా ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె న‌టిస్తోన్న మ‌రో లేడీ ఓరియెంటెడ్ మూవీ 'ఐరా'.

నోయల్-ఎస్తేర్ వివాహం

నటుడిగా ‘మగధీర’, ‘ఈగ’, ‘కుమారి 21 ఎఫ్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ప్రేమమ్’, ‘రంగస్థలం’, ‘హలో గురు ప్రేమ కోసమే’,

100 కోట్ల క్లబ్‌లో 8 సినిమాలు.. డైరెక్ట‌ర్ ఒక‌డే

ఏ దర్శకుడికైనా తను రూపొందించిన సినిమా సూపర్‌హిట్ అవ్వడం, కలెక్షన్లు కొల్లగొట్టడాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదు. అది కూడా తను చేసిన సినిమాల్లో ఎనిమిది సినిమాలు

'బైపాస్ రోడ్‌' లో భావన

దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వారందరి చూపు బాలీవుడ్ వైపే ఉంటుంది. హిందీ సినిమాల్లో నటిస్తే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చు అనేది వారి ఆలోచన.

జనవరి 6న 'మిస్టర్ మజ్ను' సాంగ్ 'హార్ట్ బ్రేక్'

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో