దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. 50 వేలకు చేరువలో మరణాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా మరణాలు 50 వేలకు చేరువవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలో ప్రతిరోజూ కరోనా కారణంగా దాదాపు 1000 మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా కేసుల సంఖ్య ప్రతిరోజూ 60 వేలకు పైనే నమోదవుతున్నాయి. ఆదివారానికి సంబంధించిన కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 63,490 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 25,89,682కి చేరింది.
కాగా గడిచిన 24 గంటల్లో 944 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. మొత్తం ఇప్పటి వరకూ 49,980కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 53 వేల మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకూ 18 లక్షల 62 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇంకా 6లక్షల 77వేల యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 71 శాతానికి పైగా ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల్లో మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 12,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... కర్ణాటకలో 8,818, ఆంధ్రప్రదేశ్ 8,756 కేసులు నమోదయ్యాయి. అయితే కర్ణాటకలో ఒక్కరోజులో 8 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరణాల విషయానికి వస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 322 మంది చనిపోయారు. తమిళనాడులో 127 మంది, కర్ణాటక 114, ఆంధ్రప్రదేశ్ 87, యూపీ, పశ్చిమ బెంగాల్‌లో 68 చొప్పున మరణించినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout