దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. 50 వేలకు చేరువలో మరణాలు..

  • IndiaGlitz, [Sunday,August 16 2020]

దేశంలో కరోనా మరణాలు 50 వేలకు చేరువవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలో ప్రతిరోజూ కరోనా కారణంగా దాదాపు 1000 మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా కేసుల సంఖ్య ప్రతిరోజూ 60 వేలకు పైనే నమోదవుతున్నాయి. ఆదివారానికి సంబంధించిన కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 63,490 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 25,89,682కి చేరింది.

కాగా గడిచిన 24 గంటల్లో 944 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. మొత్తం ఇప్పటి వరకూ 49,980కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 53 వేల మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకూ 18 లక్షల 62 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇంకా 6లక్షల 77వేల యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 71 శాతానికి పైగా ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల్లో మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 12,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... కర్ణాటకలో 8,818, ఆంధ్రప్రదేశ్ 8,756 కేసులు నమోదయ్యాయి. అయితే కర్ణాటకలో ఒక్కరోజులో 8 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరణాల విషయానికి వస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 322 మంది చనిపోయారు. తమిళనాడులో 127 మంది, కర్ణాటక 114, ఆంధ్రప్రదేశ్ 87, యూపీ, పశ్చిమ బెంగాల్‌లో 68 చొప్పున మరణించినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
 

More News

మాధవి లత హీరోయిన్ గా 'లేడీ'

ప్రముఖ హీరోయిన్ మాధవి లత సోలో పెర్ఫార్మన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ డైరెక్షన్ లో

షూటింగ్ లొకేషన్ లో యూనిట్ మధ్య బర్త్ డే కేక్ కటింగ్ మిస్ అవుతున్న - నిధి అగర్వాల్

మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు చాలా దగ్గర అయిపోయింది

అదే నాకో పెద్ద ఛాలెంజ్: ‘బిగ్‌బాస్ 4’పై నాగార్జున

తెలుగు టెలివిజన్‌లో అత్యుత్తమమైన రేటింగ్స్‌ని సాధించి, వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతిపెద్ద నాన్ ఫిక్షన్ షో ‘బిగ్‌బాస్ 4’

హెలికాఫ్టర్ షాట్ మాదిరిగానే రిటైర్మెంట్ షాక్‌.. ధోనీ వెంటే రైనా..

మహేందర్ సింగ్ ధోని.. భారత క్రికెట్ దిగ్గజం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. అద్భుతమైన కెప్టెన్.. కూల్ కెప్టెన్..

ఆకట్టుకుంటున్న విశాల్ ‘చక్ర’ ట్రైల‌ర్ ఒరిజిన‌ల్ సౌండ్ ట్రాక్‌..

హీరో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్న సినిమా ‘చక్ర’. ఈ చిత్ర ట్రైలర్‌కు సంబంధించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.