తెలంగాణ: వెయ్యికి చేరువలో కరోనా కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి తెలంగాణలో రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజురోజుకూ నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తున్న రాష్ట్ర ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 928. అంటే వెయ్యికి చేరువలో ఉందన్న మాట. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటి వరకూ 23 మంది మృతి చెందారని తెలంగాణ ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది. 194 మంది డిశ్చార్జ్ కాగా.. ఇవాళ మరో 08 మంది కోలుకుని ఇంటికెళ్లారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 19 కేసులే నమోదవ్వగా.. అత్యధికంగా సూర్యాపేటలో 26 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్-03, గద్వాల-02, ఆదిలాబాద్-02, ఖమ్మం, మేడ్చల్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని బులెటిన్ తెలంగాణ సర్కార్ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 711 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
అటు సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ నమోదైన 26 కేసులతో కలిపి సూర్యాపేటలో 80కు చేరుకుంది. జిల్లాలో మొత్తం 796 నమూనాలు సేకరించగా.. 80 మందికి కరోనా సోకింది. మరో 191 మంది ఫలితాలు రావాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో 210 మంది ఉన్నారు. మరో 4,346 మంది హోం క్వారంటైన్లో ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఇవన్నీ కమ్యూనిటీ వ్యాప్తి అనగా.. కరోనా సోకిన వ్యక్తి తాకిడి ద్వారా వచ్చిన కేసులు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 80కి చేరుకుందని జిల్లా మెడికల్, హెల్త్ ఆఫీసర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కేసుల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా.. సూర్యాపేట రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో జిల్లాలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించడం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com