తెలంగాణలో లక్షకు చేరువలో కేసులు.. నేడు ఎన్నంటే..

  • IndiaGlitz, [Friday,August 21 2020]

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. తెలంగాణలో కరోనా లక్ష కేసులకు చేరువవుతోంది. గడిచిన 24 గంటల్లో 26,767 శాంపిళ్లను పరీక్షించగా.. 1967 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 99,391కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1781 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా.. మొత్తంగా ఇప్పటి వరకూ 76,967 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 8 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 737కు చేరుకుంది. ప్రస్తుతం రాస్ట్రంలో 21,687 మంది కరోనాకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందతున్నారు. పది లక్షల జనాభాకు 22,843 మంది చొప్పున పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 1300 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.74 శాతం ఉంది. కోలుకున్న వారి రేటు 77.43 శాతం ఉంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 8,48,078 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అయితే తెలంగాణ 6.6 లక్షల మందికి కరోనా సోకి ఉండవచ్చని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ), సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సంస్థలు సంయుక్తంగా వెల్లడించాయి. హైదరాబాద్ వాసులు వాడిన మురుగునీటి నమూనాలపై సంయుక్త పరిశోధనలు నిర్వహించగా హైదరాబాద్‌లో గత 35 రోజుల్లో 6.6 లక్షల మందికి కరోనా సోకి సాధారణ స్థితికి వచ్చిందని అంచనాకు వచ్చారు. నగరంలోని ఒక ప్రాంతంలో ఎక్కువని.. ఒక ప్రాంతంలో తక్కువంటూ లేదని అన్ని ప్రాంతాల్లోనూ సమాన స్థాయిలోనే వైరస్ విస్తరించిందని పరిశోధనల ద్వారా వెల్లడైంది.

More News

కరోనా కాదు.. కుల క్వారంటైన్ సెంటర్లు.. ఏపీలో నయా ట్రెండ్..

కరోనా సమయంలో.. అసలే ఎవరినీ అంటీ ముట్టకూడదంటే.. కులంగాని కులం వారితో కలిసుండాల్సిన దుస్థితి ఏంటి అనుకున్నారో ఏమోగానీ నయా ట్రెండ్‌కి తెరదీశారు.

‘వి’.. 200 దేశాలు, టెరిటరీస్‌లో.. ఉద్వేగంగా ఉంది: నాని

నేచురల్ స్టార్ నాని.. సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో

హైదరాబాద్‌ మురుగు నీరు చెప్పిన నిజం.. 6.6 లక్షల మందికి కరోనా!

హైదరాబాద్‌లో ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలకూ.. టైటిల్‌కూ ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా? అసలు నిజమైతే ఇదేనని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ),

భారీ బ‌డ్జెట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రం!!

ఇండ‌స్ట్రీలో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన అతి కొద్ది కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

నాగ్ ద‌ర్శ‌కుడి వెబ్ సిరీస్‌..!!

ప్ర‌స్తుం డిజిట‌ల్ ట్రెండ్ న‌డుస్తోంది. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ డిజిట‌ల్ మాధ్య‌మంలోకి అడుగు పెడుతున్నారు.