ఆడ పిల్ల వేటాడాలనుకుంటే మగ సింహం కుక్కే
Send us your feedback to audioarticles@vaarta.com
RX 100తో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ నటిస్తోన్న మరో చిత్రం `RDX లవ్`తో త్వరలోనే మన ముందుకు రానుంది. శంకర్ భాను తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలవుతుందని అనౌన్స్ చేయగానే అందరిలో చిన్న ఆసక్తి మాత్రం నెలకొంది. అందుకు కారణం ఈ సినిమా టీజరే. కొన్ని రోజుల ముందు విడుదలైన ఈ సినిమా టీజర్లో రొమాన్స్ పీక్స్‌లో ఉండింది. దీంతో సినిమా ఎలా ఉండబోతుందోనని అందరూ అనుకున్నారు. ఇలాంటి సందర్భంలో విడుదలైన ట్రైలర్‌ను చూడటానికి అందరూ ఆసక్తి చూపించారు. అయితే టీజర్‌కు భిన్నంగా ట్రైలర్ ఉంది.
`ఓ కథ చెబుతాను. ఓ ఊరి కథ..` అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ సినిమా ట్రైలర్లో దర్శకుడు శంకర్ భాను చాలా కోణాలను ఆవిష్కరించారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కబడ్డీ ప్లేయర్ అని..ఆమె పేరు అలివేలు అని ట్రైలర్లో రివీల్ చేశారు. అలాగే ఊరంతా కలిసి ఆత్మాహుతికి సిద్ధపడేంత పెద్ద సమస్య కూడా ఉందని ట్రైలర్లో పొట్రేట్ చేశారు.
వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనపించొచ్చుకానీ ఆడపిల్ల వేటాడాలనుకుంటే మగ సింహం కూడా కుక్కపిల్లలా కనపడుతుంది` అమ్మాయిలతో మాట్లాడాలంటే నిజం చెప్పి బ్రతిమాలండి, కరిగిపోతారు. అబద్దం చెప్పి బాధ పెట్టకండి, కరిగించేస్తారు. ` అని పాయల్ చెప్పే డైలాగ్స్ సినిమాలోని ఎమోషన్స్, ఇన్‌టెన్స్‌ను ఎలివేట్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments