Download App

RDX Love Review

`RX 100`తో హీరోయిన్‌గా బ్రేక్ సాధించింది హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌. హాట్ అందాల‌తో యూత్‌ను తొలి చిత్రంలో ఆక‌ట్టుకున్న పాయ‌ల్ రెండో చిత్రంగా `RDX ల‌వ్` చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గానే అంద‌రిలో సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తి మొద‌లైంది. అందుకు త‌గిన‌ట్లు పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ అన్నీ యూత్‌ను ఆక‌ట్టుకునేలానే ఉండ‌టంతో పాయ‌ల్ మ‌రోసారి అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు సిద్ధ‌మైందని అర్థ‌మైంది. అయితే శంక‌ర్ భాను ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ ఎలా ఉంటుందో.. మంచి మెసేజ్ కూడా ఉంటుంద‌ని చెప్ప‌డంతో అస‌లు RDX ల‌వ్‌తో ఎలాంటి మెసేజ్ ఇవ్వ‌బోతున్నార‌నే ఆస‌క్తి మొద‌లైంది. మ‌రి RDX ల‌వ్ చిత్రం విజయాన్ని సాధించిందా?  లేదా?  అనే విష‌యాన్ని తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.

క‌థ‌:

న‌ర్స‌య్య దొర‌(వి.కె.నరేష్‌) త‌న గ్రామం చంద్ర‌న్న‌పేట‌తో పాటు చుట్టు ప‌క్క‌ల ఉన్న 40 గ్రామాల‌కున్న ఏకైక స‌మ‌స్య కోసం పోరాటం చేస్తుంటాడు. ఈ క‌థ సాగుతుండ‌గా అలివేలు(పాయ‌ల్‌) విజ‌య‌వాడ న‌గ‌రంలో ప్ర‌భుత్వం ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా ప్ర‌చారం చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె ఎయిడ్స్ నియంత్ర‌ణ కోసం కండోమ్స్‌ను వాడాల‌ని ప్ర‌చారం చేస్తుంటుంది. అప్పుడు ఆమెకు సిద్ధు(తేజ‌స్‌) ప‌రిచ‌యం అవుతాడు. అలివేలుని చూసి ప్రేమ‌లో ప‌డ్డ సిద్ధు .. ఆమె ప్రేమ కోసం ఆమెను ఫాలో అవుతుంటాడు. అదే స‌మ‌యంలో ఓ పెద్ద టీవీ ఛానెల్ అధినేత‌ గిరి ప్ర‌కాష్‌(ఆదిత్య‌మీన‌న్‌) అలివేలుని విజ‌య‌వాడ న‌గ‌రం విడిచిపెట్టి వెళ్లిపోవాల‌ని పోలీసుల‌తో చెప్పిస్తాడు. కానీ ఆమె వినదు. ఆమెను చంపించాల‌ని చూస్తాడు. హ‌త్యా ప్ర‌య‌త్నం నుండి తప్పుకున్న అలివేలు, సిద్దుతో క‌లిసి త‌న ఓ చోట‌కు పారిపోతుంది. అక్క‌డ ఆమె ఏం చేస్తుంది? అస‌లు గిరి ప్ర‌కాష్ అలివేలును ఎందుకు చంపాల‌నుకుంటాడు?  అస‌లు 40 గ్రామాల ప్ర‌జ‌లు ఎదుర్కొనే స‌మ‌స్యేంటి? స‌మ‌స్య‌కు అలివేలు ఎలా ప‌రిష్కారం చూపింద‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష‌:

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. పాయ‌ల్ రాజ్‌పుత్ మ‌రోసారి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ప్ర‌జల్లో కండోమ్స్‌ గురించి అవ‌గాహ‌న పెంచ‌డం.. మ‌ద్య‌పాన నిషేధం చేయించ‌డం, గుట్కాలు మానేసేలా చేయ‌డం వంటి ప‌నులు చేస్తుంటుంది. ఇందులో కొన్ని అతిశ‌యోక్తి దూరంగా ఉన్న ప‌నులు కూడా అనిపిస్తాయి. అంయితే వీట‌న్నింటిలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ భాను ప్ర‌సాద్ రొమాంటిక్ డోసు ఎక్కువ చేసేశాడు. ఆ స‌న్నివేశాలు సామాన్య ప్రేక్ష‌కుడికి కాస్త ఇబ్బందిగానే ఉంటాయి. ఇక యూత్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా పాయ‌ల్ అందాలు చూపించ‌డంలో వెనుక‌డుగు వేయ‌లేదు. ఇక త‌న గ్రామ స‌మ‌స్య‌ను తీర్చుకోవ‌డానికి పాయ‌ల్ చేసే ప‌నులు రీజ‌న‌బుల్‌గానే ఉన్నా.. ఇలాంటి క‌థ‌ల‌తో చాలా సినిమాలే వ‌చ్చాయి. ఇలాంటి క‌థ‌తో శంక‌ర్‌భాను సినిమా ఎందుకు చేశాడు? అనిపిస్తుంది. తేజస్ కంచ‌ర్ల హీరోయిన్‌కి స‌పోర్టింగ్ రోల్‌లా అనిపించినా త‌న పాత్ర‌కు మంచి ప్రాధాన్య‌తే క‌న‌ప‌డుతుంది. ఆదిత్య‌మీన‌న్‌, న‌రేష్‌, తుల‌సి, నాగినీడు స‌హా  అంద‌రూ వారి పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. ఇక ద‌ర్శ‌కుడు శంక‌ర్ భాను ప్ర‌సాద్ ఓ పాత క‌థ‌ను మెసేజ్ రూపంలో చెప్పాల‌నుకున్నాడు. అందుకు పాయ‌ల్ అందాల‌ను ప్ర‌ధానంగా చేసుకుని చెబితే సరిపోతుంద‌నుకున్నాడు. అయితే స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా, ఎమోష‌న‌ల్‌గా, ఆక‌ట్టుకునేలా ఉండేలా సినిమాను తెర‌కెక్కించ‌లేదు. ర‌ధ‌న్ సంగీతం బాగాలేదు. నేప‌థ్య సంగీతం బాలేదు. రాంప్ర‌సాద్ కెమెరా వ‌ర్క్ బావుంది. ప‌రుశురాం డైలాగ్స్ అక్క‌డ‌క్క‌డా పేలాయి. మొత్తంగా చూస్తే..పాయ‌ల్ అందాల ప్ర‌ద‌ర్శ‌న యూత్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చితే సినిమాకు క‌లెక్ష‌న్స్ రావ‌చ్చునేమో.

బోట‌మ్ లైన్‌: 'RDX ల‌వ్'.. సేఫ్టీ అవ‌స‌రం

Read RDX Love Movie Review in English

Rating : 1.0 / 5.0