RC16:చరణ్- బుచ్చిబాబు మూవీ .. అది కోడి రామ్మూర్తి బయోపిక్ కాదు, క్లారిటీ ఇచ్చిన చెర్రీ టీమ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో దర్శకుల పరిస్ధితి విచిత్రంగా వుంటుంది. సాధారణంగా ఫ్లాప్‌లు ఇచ్చిన దర్శకులకు మరో ఆఫర్ రావడం కష్టం. అయితే కొన్నిసార్లు మాత్రం సూపర్హిట్లు ఇచ్చిన దర్శకులకు కూడా వెంటనే ఛాన్స్‌లు దక్కవు. ఈ పరిస్థితిని చాలా కాలం ఎదుర్కొన్నారు బుచ్చిబాబు సానా. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయనకు ఆఫర్లు క్యూ కడతాయని.. బడా నిర్మాతలంతా అడ్వాన్స్‌లు ఇచ్చి లాక్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఉప్పెన్ హిట్ తర్వాత దాదాపు రెండేళ్ల నుంచి బుచ్చిబాబు ఖాళీగానే వున్నారు. ఆయన పలువురు స్టార్స్‌తో సినిమాలు తీయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది కానీ అవన్నీ గాలివార్తలేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబుకు మరోసారి మెగా కాంపౌండ్ నుంచే పిలుపొచ్చింది. అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి.
కోడి రామ్మూర్తి స్టోరీ కాదు.. కానీ స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండే :
బుచ్చిబాబు టేకింగ్‌కు ఫిదా అయిన రామ్ చరణ్ ఆయనకు పిలిచి మరి ఆఫర్ ఇచ్చారు. దీంతో బుచ్చిబాబు ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ క్రేజ్ ఆకాశాన్ని తాకిన నేపథ్యంలో .. ఆయన అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకునే అవకాశం వుంది. దీంతో బుచ్చిబాబు ఎలాంటి కథతో వస్తున్నాడో అంటూ ఫిలింనగర్లోనూ, సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కథకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఉత్తరాంధ్రకు చెందిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి పాత్రలో చరణ్ కనిపిస్తారని .. ఇందుకోసం ఆ ప్రాంత యాసపై చెర్రీ దృష్టి పెట్టినట్లుగా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చరణ్ పీఆర్ టీమ్ స్పందించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించేది కోడి రామ్మూర్తి బయోపిక్‌లో కాదని స్పష్టం చేసింది. అయితే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే సినిమానేనని.. కానీ కథేంటన్నది మాత్రం తెలియదని చరణ్ టీమ్ స్పష్టం చేసింది.
సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి ఆర్సీ 16 :
మరోవైపు ఈ సినిమాను వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సతీష్ కిలారు నిర్మాతగా పరిచయం కానున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగే ఈ ఏడాది సెప్టెంబర్‌లో బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com