క్రిప్టో కరెన్సీకి కళ్లెం.. ఇండియాలో అందుబాటులోకి డిజిటల్ రూపీ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పెట్టుబడులు పెట్టేవారు కూడా రోజురోజుకు విస్తరిస్తున్నారు. ఈ వ్యవహారం కేంద్రం దృష్టికి కూడా వచ్చింది. క్రిప్టో కరెన్సీని భారత ప్రభుత్వం నిషేధిస్తుందా..? లేదా కొద్దిపాటి ఆంక్షలతో అమలు చేస్తుందా..? వంటి ప్రచారం జరిగింది. ప్రధాని మోడీ సైతం ఆర్ధిక నిపుణులతో దీనిపై కీలక భేటీ కూడా నిర్వహించారు. దీంతో ఈసారి బడ్జెట్‌లో క్రిప్టో కరెన్సీపై ఏదో ఒక ప్రకటన వస్తుందని అంతా ఆశించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. క్రిప్టోకి పోటీకి భారత్‌లో డిజిటల్ రూపాయిని తీసుకొస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆర్బీఐ కనుసన్నల్లోనే ఈ డిజిటల్ కరెన్సీ కొనసాగుతుందని నిర్మల చెప్పారు. అంతేకాదు వర్చువల్, డిజిటల్ ఆస్తులపై వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించారు.
అయితే క్రిప్టో కరెన్సీని భారతీయ రిజర్వు బ్యాంకు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంటున్నారు. ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ప్రక్రియను ఆరంభించింది. సీబీసీడీ కరెన్సీని అన్నిరకాల అవసరాలకు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే అన్ని వివరాలను కేంద్రం ప్రజలకు తెలియజేసే అవకాశం వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout