క్రిప్టో కరెన్సీకి కళ్లెం.. ఇండియాలో అందుబాటులోకి డిజిటల్ రూపీ

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పెట్టుబడులు పెట్టేవారు కూడా రోజురోజుకు విస్తరిస్తున్నారు. ఈ వ్యవహారం కేంద్రం దృష్టికి కూడా వచ్చింది. క్రిప్టో కరెన్సీని భారత ప్రభుత్వం నిషేధిస్తుందా..? లేదా కొద్దిపాటి ఆంక్షలతో అమలు చేస్తుందా..? వంటి ప్రచారం జరిగింది. ప్రధాని మోడీ సైతం ఆర్ధిక నిపుణులతో దీనిపై కీలక భేటీ కూడా నిర్వహించారు. దీంతో ఈసారి బడ్జెట్‌లో క్రిప్టో కరెన్సీపై ఏదో ఒక ప్రకటన వస్తుందని అంతా ఆశించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. క్రిప్టోకి పోటీకి భారత్‌లో డిజిటల్ రూపాయిని తీసుకొస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆర్బీఐ కనుసన్నల్లోనే ఈ డిజిటల్ కరెన్సీ కొనసాగుతుందని నిర్మల చెప్పారు. అంతేకాదు వర్చువల్, డిజిటల్ ఆస్తులపై వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించారు.

అయితే క్రిప్టో కరెన్సీని భారతీయ రిజర్వు బ్యాంకు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అంటున్నారు. ఇప్పటికే సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (CBDC) ప్రక్రియను ఆరంభించింది. సీబీసీడీ కరెన్సీని అన్నిరకాల అవసరాలకు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే అన్ని వివరాలను కేంద్రం ప్రజలకు తెలియజేసే అవకాశం వుంది.

More News

వేతన జీవులకు నిరాశ... ట్యాక్స్ స్లాబులపై నోరు విప్పని నిర్మలా సీతారామన్

2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ పేయర్స్‌కు నిర్మలమ్మ నిరాశనే మిగిల్చారు.

ఆర్మీకి 117 ఎకరాల భూమి విరాళం.. అది అవాస్తవం, నేనేమి ఇవ్వలేదు : పుకార్లకు సుమన్ చెక్

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు మన చుట్టూ చాలా మంది వున్నారు. ఇక సోషల్ మీడియా రాకతో ఈ పిచ్చి మరింత ముదిరింది.

‘‘భీమ్లా నాయక్’’ ఆ రెండింటిలో ఏ రోజునో మరి..?

రానున్న మూడు నెలల్లో సినిమా పండగని స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు చెప్పినట్లుగానే టాలీవుడ్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

ఆర్ఆర్ఆర్ విడుదలపై క్లారిటీ.. వెనక్కి జరిగిన ‘‘ఆచార్య’’ , రిలీజ్ ఎప్పుడంటే..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆర్ఆర్ఆర్’’ను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు

మార్చి 18 కాదు... ఏప్రిల్ 28 కాదు: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ఇదే, ఈసారి మాత్రం పక్కా...!!!

బాహుబలి సిరీస్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’.