కరోనా కష్టకాలంలో ఆర్బీఐ మరో శుభవార్త
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతోంది. లాక్ డౌన్‌తో ఎలాంటి ఆదాయం లేక జనాలు ఇబ్బందులు పడుతున్న కష్టకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తియ్యటి శుభవార్త చెప్పింది. రెపో రేటును మరోసారి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు కీలక విషయాలను వెల్లడించారు. 40 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది.. దీంతో రెపో రేటు 4 శాతానికి దిగొచ్చింది. తాజా ప్రకటనతో రుణ రేట్లు మరింత దిగిరానున్నాయి. అంతేకాకుండా డిపాజిట్ రేట్లపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది. రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో రివర్స్ రెపో రేటు ఇదివరకు 3.75 ఉండగా ప్రస్తుతం 3.35 శాతానికి దిగొచ్చింది. కాగా.. రిజర్వు బ్యాంక్ మార్చి 27న రెపో రేటు రేటును ఏకంగా 75 బేసిస్ పాయింట్ మేర కోత విధించిన విషయం తెలిసిందే. ఆర్థిక రంగ అభివృద్ధికి ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. మొత్తానికి చూస్తే 2 నెలల్లోనే మూడుసార్లు వడ్డీరేట్లను ఆర్బీఐ సమీక్షించింది.
అందుకే తగ్గింపులు..
‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో సిమెంట్, ఉక్కు పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడింది. లాక్‌డౌన్ కాలంలో సిమెంట్ ఉత్పత్తి 25శాతం తగ్గింది. పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడింది. 3.7 శాతం ఆహార ఉత్పత్తులు పెరిగాయి. 31-32 శాతం మేర ప్రపంచ వాణిజ్యం తగ్గినట్లు WTO ప్రకటించింది. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం పడిపోయింది. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగింది. ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.6 శాతానికి పెరిగింది. దేశంలో ఆహార భద్రతకు భరోసా ఉంది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగింది. ద్రవ్యోల్బణం అంచనా వేయడం క్లిష్టంగా మారింది. లాక్‌డౌన్ నిబంధనలపై ద్రవ్యోల్బణం ఆధారపడి ఉంది. 2021లోనూ జీడీపీ గ్రోత్ రేటు తిరోగమనంలోనే ఉంటుంది. ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు దెబ్బతిన్నాయి. మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకు రెపో రేటు తగ్గించాం’ అని ఆర్బీఐ గ్రవర్నర్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments