ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. డిజిటల్ కరెన్నీని...

  • IndiaGlitz, [Wednesday,January 27 2021]

ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ యుగం. కాబట్టి నగదు కూడా డిజిటల్ కరెన్సీ రూపంలో లభ్యమైతే ఎలా ఉంటుంది? ఊహ అయితే బాగానే ఉంది కానీ ఇది సాధ్యమా అనిపిస్తోంది కదా.. ఇదే అంశాన్ని ఆర్‌బీఐ కూడా పరిశీలిస్తోంది. ఇప్పటికే వర్చువల్, క్రిప్టో కరెన్సీల పేరిట నగదుకు ప్రత్యామ్నాయ రూపాలెన్నో వచ్చేశాయి. ఇక డిజిటల్ రూపం కూడా ఇచ్చేస్తే పోలా అనుకుందో ఏమో కానీ ఆ దిశగా ఆర్‌బీఐ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఫియట్ కరెన్సీకి(నాణేలు, నోట్లు) డిజిటల్ రూపం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కేంద్ర బ్యాంకు పరిశీలిస్తోంది.

భారత్‌లో చెల్లింపుల వ్యవస్థ పేరిట పేరిట ప్రచురించిన అధ్యయనంలో ఈ విషయాలను ఆర్‌బీఐ వెల్లడించింది. అయితే ఈ కరెన్సీలు, ఫలితంగా వచ్చే ప్రమాదల కారణంగా భారత ప్రభుత్వ వర్గాలు ఎప్పటినుంచో డిజిటల్ కరెన్సీలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుతమున్న ఫియట్ కరెన్సీని పోలిన డిజిటల్ కరెన్సీ అవసరం దేశంలో ఉందా?.. ఒకవేళ ఉంటే దానిని ఎలా చలామణీలోకి తేవాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ వెల్లడించింది.

ప్రస్తుతమున్న నగదుకు మాదిరిగానే ఈ డిజిటల్ కరెన్సీకి కూడా ప్రభుత్వమే పూచిగా నిలుస్తోంది. కాబట్టి..ఈ కరెన్సీని సాధారణ నగదు మాదిరిగానే చక్కగా వినియోగించుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత కారణంగా చెల్లింపుల వ్యవస్థల్లో ఎన్నో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ చెల్లింపుల నుంచి ఏకంగా నగదుకు ప్రత్యామ్మాయంగా పలువురు భావిస్తున్న క్రిప్టో కరెన్సీ వరకూ అనేక సృజనాత్మక వ్యవస్థలు ఇటీవల కాలంలో ఉనికిలోకి వచ్చాయి. ఇక ముందు డిజిటల్ కరెన్సీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

More News

పద్మ పురస్కారాలతో ప్రతిభాశీలురకు పట్టం: పవన్

గాన గంధర్వుడు దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక చేయడం ముదావహమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఎప్పుడో చెప్పకుంటే లీక్ చేస్తా: కొరటాలకు చిరు వార్నింగ్

మెగాస్టార్‌ చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్,

'ఆర్ఆర్ఆర్‌' పోస్ట‌ర్ కాపీ కొట్టారంటూ ట్రోలింగ్‌...!

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)'.

ఎన‌ర్జీకి కేరాఫ్‌... మాస్ మ‌హారాజా ర‌వితేజ‌

మాస్ మహారాజా రవితేజ... డైలాగ్ డెలివరీ, సరికొత్త బాడీ లాంగ్వేజ్, తిరుగులేని ఎనర్జీ, డిఫరెంట్ చిత్రాలకే పక్కాకమర్షియల్ ఎంటర్ టైనర్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. సినీ రంగ ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా

తెలుగు రాష్ట్రాల్లో విరిసిన పద్మాలు.. ఆసక్తికర విషయాలివే

తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా నలుగురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు కాగా.. ముగ్గురు ఏపీకి చెందిన వారు. కొమురంభీం జిల్లా జైనూరు మండలం మార్లవాయికి