ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. డిజిటల్ కరెన్నీని...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ యుగం. కాబట్టి నగదు కూడా డిజిటల్ కరెన్సీ రూపంలో లభ్యమైతే ఎలా ఉంటుంది? ఊహ అయితే బాగానే ఉంది కానీ ఇది సాధ్యమా అనిపిస్తోంది కదా.. ఇదే అంశాన్ని ఆర్‌బీఐ కూడా పరిశీలిస్తోంది. ఇప్పటికే వర్చువల్, క్రిప్టో కరెన్సీల పేరిట నగదుకు ప్రత్యామ్నాయ రూపాలెన్నో వచ్చేశాయి. ఇక డిజిటల్ రూపం కూడా ఇచ్చేస్తే పోలా అనుకుందో ఏమో కానీ ఆ దిశగా ఆర్‌బీఐ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఫియట్ కరెన్సీకి(నాణేలు, నోట్లు) డిజిటల్ రూపం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కేంద్ర బ్యాంకు పరిశీలిస్తోంది.
భారత్‌లో చెల్లింపుల వ్యవస్థ పేరిట పేరిట ప్రచురించిన అధ్యయనంలో ఈ విషయాలను ఆర్‌బీఐ వెల్లడించింది. అయితే ఈ కరెన్సీలు, ఫలితంగా వచ్చే ప్రమాదల కారణంగా భారత ప్రభుత్వ వర్గాలు ఎప్పటినుంచో డిజిటల్ కరెన్సీలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుతమున్న ఫియట్ కరెన్సీని పోలిన డిజిటల్ కరెన్సీ అవసరం దేశంలో ఉందా?.. ఒకవేళ ఉంటే దానిని ఎలా చలామణీలోకి తేవాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ వెల్లడించింది.
ప్రస్తుతమున్న నగదుకు మాదిరిగానే ఈ డిజిటల్ కరెన్సీకి కూడా ప్రభుత్వమే పూచిగా నిలుస్తోంది. కాబట్టి..ఈ కరెన్సీని సాధారణ నగదు మాదిరిగానే చక్కగా వినియోగించుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత కారణంగా చెల్లింపుల వ్యవస్థల్లో ఎన్నో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ చెల్లింపుల నుంచి ఏకంగా నగదుకు ప్రత్యామ్మాయంగా పలువురు భావిస్తున్న క్రిప్టో కరెన్సీ వరకూ అనేక సృజనాత్మక వ్యవస్థలు ఇటీవల కాలంలో ఉనికిలోకి వచ్చాయి. ఇక ముందు డిజిటల్ కరెన్సీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com