Credit Card-UPI : ఇక క్రెడిట్ కార్డుతోనూ యూపీఐ పేమెంట్స్... బోలెడన్నీ లాభాలు..?

  • IndiaGlitz, [Thursday,June 09 2022]

దేశంలో నోట్ల రద్దు తర్వాతి నుంచి డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. కరెన్సీ రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని నిర్ణయించిన కేంద్రం సైతం అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో యూపీఐ ( యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) రాకతో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే వంటి వాటిని ఇప్పుడు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. గ్రామీణ భారతంలోనూ ఈ సేవలు అందుతున్నాయి. యూపీఐ ద్వారా మనదేశంలో ఈ ఏడాది మే నెలలో 10 లక్షల కోట్ల లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలో మొత్తం 595 కోట్ల లావాదేవీలు జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు గాను ఆర్‌బీఐ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐలకు ఇకపై క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానించేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది. దీనికి సంబంధించి త్వరలోనే నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కి ఆదేశాలు జారీ చేస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడించారు.

డిజిటల్ లావాదేవీల్లో ఇక దూకుడే:

దీనిలో భాగంగా తొలుత దేశీయ రూపే క్రెడిట్ కార్డును యూపీఐ ఖాతాకు అనుసంధానించేందుకు అవకాశం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు యూపీఐ ఖాతాకు కేవలం డెబిట్ కార్డులను మాత్రం అనుసంధానించుకునేందుకు అనుమతి వుంది. తాజాగా క్రెడిట్ కార్డులను కూడా లింక్ చేసేందుకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశంలో డిజిటల్ లావాదేవీలు మరింత ఊపందుకుంటాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

యూపీఐకి క్రెడిట్ కార్డుని లింక్ చేయడం వల్ల లాభాలు:

ఇప్పటి వరకూ ఖాతాలో ఉన్న నగదు ద్వారానే యూపీఐ లావాదేవీలు నిర్వహించే వీలుండేది. క్రెడిట్ కార్డు అనుసంధానిస్తే.. క్రెడిట్ కార్డు లిమిట్ యూపీఐ పేమెంట్ కోసం ఉపయోగపడుతుంది.

రూపే క్రెడిట్ కార్డు యూపీఐ నెట్‌వర్క్‌తో అనుసంధానం వల్ల ఇతర రంగాల్లో కూడా యూపీఐ చెల్లింపులు పెరుగుతాయి.

యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కి క్రెడిట్ కార్డుని లింక్ చేయడం వల్ల కార్డు స్వైప్ చేయకుండానే చెల్లింపులు చేయొచ్చు.

More News

sajjala rama krishna reddy: మీ ‘‘బ్రోకర్’’ బాగోతం మొత్తం తెలుసు.. పవన్ జోలికొచ్చారో : సజ్జలకు పోతిన మహేశ్ వార్నింగ్

వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్.

nadendla manohar: వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం.. తాగునీటి కోసం 8 లక్షల మంది కటకట: నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. పోలవరంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్మించిన

Auto Debit: ఆటో డెబిట్‌పై ప్రజలకు ఆర్‌బీఐ తీపి కబురు .. ఇక రూ.15 వేల వరకు ఓటీపీతో పనిలేదు

బ్యాంకింగ్ , ఆర్ధిక సేవలకు సంబంధించి బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పలు కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.

AP SSC Results : టీచర్లకు మద్యం షాపుల్లో డ్యూటీలు.. రిజల్ట్స్ ఇలా కాక ఎలా, మీ వల్లే పిల్లలు ఫెయిల్: పవన్

ఏపీలో పదో తరగతి పరీక్షల్లో లక్షలాది మంది విద్యార్ధులు ఫెయిల్ అయిన వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.

Remote Voting:  సొంతూరికి దూరంగా వుంటున్నారా.. ఇకపై ఎక్కడున్నా ఓటు వేయొచ్చు, రిమోట్ ఓటింగ్‌పై ఈసీ ఫోకస్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాము లాంటిది.