నా ప్రయత్నానికి గెలుపు అదే - విశాల్
Saturday, June 4, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం రాయుడు. ఈ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించారు. తెలుగు, తమిళ్ లో రూపొందిన ఈ చిత్రాన్ని హరి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇటీవల రిలీజైన రాయుడు చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో హీరో విశాల్ మాట్లాడుతూ...రాయుడు సినిమా నా కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు విశాల్ బాగా నటించాడు అంటున్నారు. నా ప్రయత్నానికి గెలుపు అదే అనుకుంటున్నాను. ఈ చిత్రాన్ని హరి తెలుగులో రిలీజ్ చేసారు. ఎప్పటి నుంచో హరితో సినిమా చేయాలనుకుంటున్నాను. హరితో సినిమా చేయాలనేది ఇన్నాళ్లకు ఈవిధంగా కుదిరింది. ఈ సినిమా నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో మళ్లీ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయాలనిపిస్తుంది. డైరెక్టర్ ముత్తయ్యతో నెక్ట్స్ ఇయర్ మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను.
తెలుగు, తమిళ్ రెండు భాషల్లో రాయుడు సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. తెలుగులో రాయుడు విజయం సాధించింది అని తెలిసి మా అమ్మ ఇప్పుడు కూడా నువ్వు తెలుగులో స్ట్రైయిట్ ఫిల్మ్ చేయకపోతే నీ అంత ఇడియట్ మరొకరు ఉండరు అని కోపంగా చెప్పింది. అమ్మ అంత గట్టిగా చెప్పడంతో త్వరలో తెలుగులో స్ట్రైయిట్ ఫిల్మ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. అలాగే పందెం కోడి 2 చిత్రం కూడా చేయనున్నాను అన్నారు.
హీరోయిన్ శ్రీదివ్య మాట్లాడుతూ...తెలుగులో రాయుడు చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం చిత్ర నిర్మాత హరి గారే. రాయుడు నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండే స్పెషల్ మూవీ. ఈ చిత్రంలో పోషించిన భాగ్యలక్ష్మి లాంటి పవర్ ఫుల్ పాత్రలు మరిన్ని చేయాలనిపిస్తుంది అన్నారు.
నిర్మాత హరి మాట్లాడుతూ...విశాల్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే. రాయుడు చిత్రం ఫస్ట్ వీక్ లోనే 5 కోట్లు షేర్ సాధించింది. రెండోవారంలో కూడా 200 థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం ఆనందంగా ఉంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments