'రాయుడు' ఆడియో, సినిమా రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా, శ్రీదివ్య హీరోయిన్‌గా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'రాయుడు'. విశాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హీరో కార్తీ కాంబినేషన్‌లో 'కొంబన్' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన ముత్తయ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా, ధనుష్ హీరోగా రూపొందిన 'రఘువరన్ బి.టెక్' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన వేల్‌రాజ్ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ అందించడం విశేషం. డి.ఇమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలను మే 11న, సినిమాను మే 20న విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.
ఈ సందర్భంగా మాస్ హీరో విశాల్ మాట్లాడుతూ - ''నా కెరీర్‌లోనే ఇది ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది. మే 11న ఈ సినిమా ఆడియో విడుదల చేసి సినిమాను మే 20న విడుదల చేస్తున్నాం. పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'రాయుడు' తప్పకుండా మీ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
జి.హరి మాట్లాడుతూ - ''రాయుడు' విశాల్ సినిమాల్లోనే ఒక క్రేజీ ఫిల్మ్ అవుతుంది. డి.ఇమాన్ గారు మంచి మ్యూజిక్ అందించారు. మే 11న పాటలను విడుదల చేస్తాం. మే 20న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments