'రాయుడు' ఆడియో, సినిమా రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Monday,May 02 2016]

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా, శ్రీదివ్య హీరోయిన్‌గా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హీరో కార్తీ కాంబినేషన్‌లో 'కొంబన్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన ముత్తయ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తుండగా, ధనుష్‌ హీరోగా రూపొందిన 'రఘువరన్‌ బి.టెక్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన వేల్‌రాజ్‌ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ అందించడం విశేషం. డి.ఇమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలను మే 11న, సినిమాను మే 20న విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''నా కెరీర్‌లోనే ఇది ఓ డిఫరెంట్‌ మూవీ అవుతుంది. మే 11న ఈ సినిమా ఆడియో విడుదల చేసి సినిమాను మే 20న విడుదల చేస్తున్నాం. పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'రాయుడు' తప్పకుండా మీ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

జి.హరి మాట్లాడుతూ - ''రాయుడు' విశాల్‌ సినిమాల్లోనే ఒక క్రేజీ ఫిల్మ్‌ అవుతుంది. డి.ఇమాన్ గారు మంచి మ్యూజిక్ అందించారు. మే 11న పాటలను విడుదల చేస్తాం. మే 20న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి'' అన్నారు.

More News

'టైటానిక్' ఆడియో లాంచ్

రాజీవ్ సాలూరి,యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా కన్నా సినీ ప్రొడక్షన్స్ బ్యానర్పై నూతన చిత్రం 'టైటానిక్'.

బాల‌య్య మూవీకి మోక్ష‌జ్ఞ అసిస్టెంట్ డైరెక్ట‌ర్...

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ వంద‌వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్  ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిస్తున్నారు.

అందుక‌నే...అనిల్ నెక్ట్స్ మూవీలో చిన్న క్యారెక్ట‌ర్ ఇచ్చినా చేస్తాను - రాశీ ఖ‌న్నా

ఊహ‌లు గుస‌గుస‌లాడే..చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై తొలి చిత్రంతోనే అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న ముద్దుగుమ్మ రాశీ ఖ‌న్నా. ఆత‌ర్వాత జిల్, జోరు, బెంగాల్ టైగ‌ర్ తదిత‌ర చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది.

సందీప్ తో మారుతి హీరోయిన్...

మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ తో హీరోయిన్ గా పరిచయమైన తెలుగు అమ్మాయి నందిత రాజ్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత నందిత లవర్స్, శంకరాభరణం, సావిత్రి సహా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్న రేంజ్ లో నేమ్ రాలేదు.

గోపీచంద్ బయోపిక్ కి డైరెక్టర్ అతనా...?

మిల్కా సింగ్,మేరికోమ్ జీవిత చరిత్రలు...మంచి ఆదరణ పొందడంతో స్పోర్ట్స్ పర్సనాలిటీస్ బయోపిక్ సీజన్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు.