జగన్‌ను నేను ఆ మాట అన్లేదు.. బెదిరిస్తున్నారు : రాయపాటి

  • IndiaGlitz, [Thursday,April 16 2020]

‘కమ్మ వారు ఏం చేస్తారులే అనుకోవద్దని.. కమ్మవారు తలుచుకుంటే జగన్ లేచిపోతాడు’ అని ఏపీ సీఎంపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని మీడియా తప్పుగా అర్థం చేసుకుందని రాయపాటి చెప్పుకొచ్చారు. ఇవాళ మీడియా ముందుకొచ్చిన ఆయన.. సీఎంగా అన్ని కులాలను కలుపుకుపోవాలని అని మాత్రమే చెప్పానన్నారు. కమ్మవారిపై ద్వేషం మంచిది కాదని సీనియర్‌ రాజకీయ నేతగా మాత్రమే తాను సలహా ఇచ్చానన్నారు. జగన్‌పై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని రాయపాటి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కమ్మ కులస్తుల పట్ల జరుగుతున్న వివక్షపైనే తాను మాట్లాడానన్నారు. సీఎం స్థాయి వ్యక్తి తరచూ కులాల ప్రస్తావన తేవడం తనను బాధించిందన్నారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు తొలి నుంచి మా కుటుంబం వ్యతిరేకమన్నారు.

రాత్రి నుంచి..

‘నేను అనని మాటలు అన్నట్లు ప్రచారం కావడంతో రాత్రి నుంచి వందలాది బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఫోన్ చేసిన వాళ్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలో కూడా నాపై అసభ్యకర వ్యాఖ్యలు పెడుతున్నారు’ అని రాయపాటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతకీ ఆయన ఏమన్నారు..!?

ఎవరైనా పెద్ద పెద్ద పోస్టింగ్స్‌ ఉండేవారు ‘కమ్మ’ అని తెలిస్తే తీసి పక్కన పడేస్తున్నారు. ఇలాంటి పద్ధతులు మంచివి కాదని జగన్ మానుకోవాలి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రెడ్డి కులం వారికే పోస్టింగ్స్ ఇస్తోంది. కమ్మ వారు ఏం చేస్తారులే అనుకోవద్దని.. కమ్మవారు తలుచుకుంటే జగన్ లేచిపోతాడు. జగన్ పరిపాలన గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లుగా ఉంది. జగన్.. ప్రతి విషయంలోనూ కమ్మ, కమ్మ అంటూ గోల చేస్తోంది. జగన్ కనీకం మంత్రులకు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను మార్చడం మంచిది కాదు. ఎన్నికలు వాయిదా వేయకపోతే వేల మంది చనిపోయేవారు. కరోనాను సీఎం జగన్ చాలా ఈజీగా తీసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫానే క్వారంటైన్‌లో ఉన్నాడు. కరోనా తగ్గిన తర్వాత అమరావతి విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతాను. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని మారిస్తే మాత్రం వైసీపీ కచ్చితంగా జీరో అవుతుంది. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ ఓటమి ఖాయం’ అని రాయపాటి జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే.

More News

రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు.. వాట్ నెక్స్ట్!?

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలో పరిస్థితి అల్లకల్లోల్లంగా ఉంది. ఇండియాలో అంత లేదు కానీ.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం

కరోనాపై పోరులో 'హిట్' అవ్వాలంటే...

లాక్‌డౌన్ వల్ల బయటకు వెళ్లకూడదని ప్రతిఒక్కరికీ ఉంటుంది. కానీ, కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో బయట అడుగుపెట్టక తప్పదు. మందుల కోసమో, నిత్యావసర సరుకుల కోసమో బయటకు వెళ్లవలసిన పరిస్థితి.

సురభి గ్రూప్‌కు సాయం చేసి పెద్ద మనసు చాటుకోండి!

చరిత్రను చూపి సమాజంలో జరిగే మంచి చెడులను తెలిపేది ‘నాటకం’ అనే విషయం అందరికీ తెలిసిందే. కాయాకష్టం చేసి అలసి సొలసి పోయిన శ్రమజీవికి ఉపశమనం కల్పించేదీ నాటకమే.

కరోనా భయం: ఫ్రెండ్ దగ్గుతున్నాడని కాల్చేశాడు..!

రోనా.. కరోనా.. ఉదయం నిద్రలేచింది మొదలుకుని మళ్లీ నిద్రపోయే వరకూ ఆ మహమ్మారి భయమే. ఎవరు దగ్గుతున్నా.. తుమ్ముతున్నా వారిపై అనుమానమే.

మాజీ ల‌వ‌ర్ పేరుని చెరిపేసిన న‌య‌న‌తార‌

ద‌క్షిణాది హీరోయిన్స్‌లో న‌య‌న‌తార‌కు ఉన్న క్రేజే వేరు. మూడు నాలుగు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డ‌మే కాదు. సినిమా ప్ర‌మోష‌న్స్‌కు రాన‌ని ముందే చెప్పేస్తుంది.