Rayapati: టీడీపీ దిక్కుమాలిన పార్టీ.. లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తా: రాయపాటి
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలు జిల్లాలకు చెందిన కీలక నేతలూ ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లాలోని సీనియర్ నాయకులు రాయపాటి కుటుంబానికి చెందిన రాయపాటి రంగారావు కూడా రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీలో ఇమడలేనని.. తన రాజీనామా లేఖను ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంతేకాకుండా టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటూ ఛాలెంజ్ కూడా విసిరారు. దీంతో ప్రస్తుతం రంగారావు వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
రూ.150కోట్లు తీసుకున్నారు.
టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థ అని ఆరోపించారు తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో రూ.150 కోట్లు తమ నుంచి తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. లోకేష్, చంద్రబాబు ఎంత తీసుకున్నారో తమ దగ్గర లెక్కలు కూడా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తా? అని ఛాలెంజ్ చేశారు. సవాల్ చేసి చెబుతున్నా.. లోకేష్‌ను మంగళగిరిలో ఓడిస్తానని స్పష్టంచేశారు. తండ్రీకొడుకులు ఇద్దరూ దొంగలని విమర్శించారు.
చంద్రబాబు ఫొటోను పగలకొట్టి మరీ..
కియా కంపెనీ తానే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. మరి రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను చంద్రబాబు లోకేష్ ఎక్కడ పనిచెయ్యనిచ్చారు?అని ప్రశ్నించార. కన్నా లక్ష్మీనారాయణ ఒక్క కులానికి పని చేస్తారని.. తాము అన్ని కులాలకు పని చేస్తామని రంగారావు వ్యాఖ్యానించారు. అనంతరం తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను ఎత్తి నేలకేసి కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించాలని టీడీపీ నిర్ణయించడం.. సత్తెనపల్లి సీటును కన్నాకు కేటాయించడంతో ఆయన టీడీపీని వీడినట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments