కిరణ్ అబ్బవరం, ప్రియాంకజవాల్కర్ జంటగా రాయలసీమ నేపథ్యంలో ' SR కళ్యాణమండపం - Est. 1975 '
Send us your feedback to audioarticles@vaarta.com
'రాజావారు రాణిగారు' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సివాలా చిత్రంతో ఆకట్టుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పైన ఒక చిత్రం రూపొందుతోంది. ఎలైట్ గ్రూప్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ' SR కళ్యాణమండపం - Est. 1975 ' అనే టైటిల్ ని ఖరారు చేస్తూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఒక కళ్యాణమండపం చుట్టూ జరిగే కథతో ఎంతో ఆసక్తిగా రూపొందుతని, రాయలసీమ నేపథ్యంలో సాగే వినోదాత్మక అంశాలున్న కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నట్లుగా దర్శకుడు శ్రీధర్ గాదె తెలిపారు. ఇక ఈ సినిమాలో 'డైలాగ్ కింగ్' సాయి కుమార్ హీరో తండ్రి పాత్ర పూర్తి పోషిస్తున్నారు. ఇక తన కెరీర్ లో తొలిసారిగా సాయికుమార్ పూర్తిగా రాయలసీమ మాండలికం, వ్యావహారిక శైలిని అనుసరించనున్నారట, అలానే తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని గొప్పగా చూపించే ప్రయత్నం ఈ సినిమాలో జరుగుతుందని చిత్ర బృందం చెబుతోంది. మొదటి షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ కి 13వ తారీఖు నుంచి రాజంపేటలోని అన్నమాచార్య కాలేజీలో జరగనుందని ఎలైట్ టీమ్ చెబుతోంది.
నటీనటులు : కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, తులసి శివమణి, అరుణ్ కుమార్, అనిల్ జీలా, కష్యప్ శ్రీనివాస్.
టెక్నీషన్స్ : సంగీతం : చేతన్ భరద్వాజ్ , కెమెరామెన్ : విశ్వాస్ డేనియల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments