రాయబారి వాయిదాకి కారణం ఇదే...
- IndiaGlitz, [Monday,February 15 2016]
వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్లో రూపొందిన కంచె కమర్షియల్ సక్సెస్ సాధించడంతో వీరిద్దరూ కలసి రాయబారి సినిమా చేయాలనుకున్నారు. మార్చిలో రాయబారి సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసారు. ఇటీవల క్రిష్ టీమ్ జార్జియా, యూరప్ వెళ్లి లోకేషన్స్ కూడా చూసారు. అంతా బాగానే ఉంది వచ్చే నెలలో రాయబారి షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న టైం లో రాయబారి ప్రాజెక్ట్ వాయిదా పడిందంటూ వార్త బయటకు వచ్చింది.
అసలు రాయబారి వాయిదా పడడానికి కారణం ఏమిటంటే...రాయబారి కథలో హీరో కంటే హీరోయిన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉందట. అది హీరో వరుణ్ తేజ్ కి నచ్చలేదట. అందుచేత రాయబారి ప్రాజెక్ట్ నుంచి హీరో వరుణ్ తేజ్ తప్పుకున్నట్టు సమాచారం. మరి వరుణ్ తేజ్ ప్లేస్ లో ఎవరోస్తారో..? ఎప్పుడు రాయబారి ని క్రిష్ స్టార్ట్ చేస్తారో..? చూడాలి.