సరికొత్త పాత్రలో మాస్‌రాజా రవితేజ...!

  • IndiaGlitz, [Monday,October 05 2020]

మాస్‌ మహారాజాఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ‘క్రాక్’ త‌ర్వాత ర‌మేశ్ వ‌ర్మ‌ సినిమాలో నటించాల్సి ఉంది. దీని తర్వాత వ‌క్కంతం వంశీ, త్రినాథ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. లేటెస్ట్‌ సమాచారం మేరకు మారుతి దర్శకత్వంలోనూ రవితేజ ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడని  ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో రవితేజ లాయర్‌ పాత్రలో నటిస్తాడని టాక్‌. 'జాలీ ఎల్‌ఎల్‌బీ' తరహాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్‌ కూడా ఉంటుందని అంటున్నారు.

త్వరలోనే రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ చేయబోతున్న  ఈ చిత్రం తమిళ చిత్రం ‘చ‌తురంగ వేట్టై’కు రీమేక్ అని కూడా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. రీమేక్ చిత్రం ‘రాక్ష‌స‌న్’ను తెలుగులో ‘రాక్ష‌సుడు’ పేరుతో రీమేక్ చేసి స‌క్సెస్ కొట్టారు ర‌మేశ్ వ‌ర్మ‌. కాబ‌ట్టి ఈసారి కూడా ర‌వితేజ‌తో రీమేక్ అయితేనే బెట‌ర్ అని ర‌మేశ్ వ‌ర్మ భావిస్తున్నార‌ట‌. ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నార‌ని టాక్‌.

More News

సంజయ్ దత్ తాజా పిక్ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌కు చెందిన తాజా పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎమ్మెల్సీ బరిలో జర్నలిస్టులు..

జర్నలిస్టులు రాజకీయరంగ ప్రవేశం చేయడమనేది కొత్తేమీ కాదు... కానీ ఎమ్మెల్సీ బరిలో ఈ స్థాయిలో పోటీ చేయడమే ఇప్పటి వరకూ జరిగి ఉండకపోవచ్చు.

ఈ వారమైనా భజన ఆపుతారా?

బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభమైన తొలి వారం ఈ షో ఏంటి? అసలు ముక్కూ మొహం తెలియని వ్యక్తులను తీసుకొచ్చి పెట్టి వీళ్లేం సాధించాలని అనుకుంటున్నారు?

అమెరికాకు మహేష్.. 45 రోజులు అక్కడే..

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన చిత్ర పరిశ్రమ.. కేంద్రం షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు...

‘తలైవి’ షూటింగ్‌లో కంగన.. చాలా ఓదార్పునిచ్చే సెట్ అంటూ ట్వీట్..

వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.