వివాదంలో రవితేజ ‘‘ఖిలాడీ’’... రిలీజ్ ఆపాలంటూ కోర్టుకెక్కిన హిందీ నిర్మాత
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్యన రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే వీకెండ్ కావడంతో రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం జనాలు థియేటర్లలోకి బాగానే వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖిలాడి సినిమా వివాదంలో చిక్కుకుంది. ఏకంగా బాలీవుడ్ నుంచి ఈ సినిమా మేకర్స్‌కు స్ట్రోక్ తగిలింది. ఖిలాడి టైటిల్ తమదని.. నిర్మాత రతన్ జైన్ కేసు పెట్టారు. 1992లో అక్షయ్ కుమార్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించి, రిలీజ్ చేసినట్లు ఆయన చెప్పారు.
ఈ వివాదం ముగిసేవరకు ఖిలాడీ ఓటీటీ రిలీజ్‌ను ఆపాలంటూ రతన్ జైన్ కోర్టులో పిటిషణ్ దాఖలు చేశారు. 'ఖిలాడి' సినిమా టైటిల్ మార్చాలని.. దీనిని గతంలోనే ట్రేడ్ మార్క్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయించినట్లు ఆయన తెలిపారు. తాను డబ్బు ఆశించడం లేదని.. తన 'ఖిలాడి' సినిమా ప్రతిష్ట గురించే ఆలోచిస్తున్నానని రతన్ జైన్ చెప్పారు. దక్షిణాదిన టైటిల్స్ రిజిస్టర్ చేయించి.. అదే టైటిల్‌తో వారి సినిమాలను హిందీలో రిలీజ్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
'ఖిలాడి' అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతుందనే విషయం కూడా తనకు తెలియదని.. ఇటీవల ట్రైలర్ చూసిన తరువాతే తెలిసిందని రతన్ జైన్ అన్నారు. సినిమా రిలీజ్ ఆపడం కష్టమని న్యాయమూర్తి చెప్పడంతో.. ఓటీటీ రిలీజ్‌ను ఆపాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ వివాదంపై రవితేజ కానీ ఖిలాడి సినిమా యూనిట్ కానీ స్పందించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com