ర‌వితేజ 66వ చిత్రం ఖ‌రారు

  • IndiaGlitz, [Saturday,October 26 2019]

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్లో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధ‌మ‌వుతుంది. డాన్ శీను, బ‌లుపు వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. ర‌వితేజ 66వ చిత్ర‌మిది.

ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేవిధంగా ఈ సినిమా ఉండేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. వీరిద్ద‌రి హ్యాట్రిక్ సినిమా కావ‌డంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్‌లో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభిస్తామ‌ని, అలాగే సినిమాకు సంబంధించిన మిగిలిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియజేసింది.

ప్ర‌స్తుతం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'డిస్కోరాజా' పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రానుంది. పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేశ్‌, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దీని త‌ర్వాత‌నే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే ర‌వితేజ త‌న 66వ సినిమాను స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఈ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని టాక్‌.

More News

'ఎంత మంచివాడవురా' ఆఖరి షెడ్యూల్‌

నందమూరి కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా రూపొందుతోన్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్ని

చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌'

1980 ద‌శ‌కంలో హీరో, హీరోయిన్స్ అంద‌రూ ఓ చోట చేరి సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటూ వ‌స్తున్నారు. ఈ సెల‌బ్రేష‌న్స్‌కు ఇది ప‌దో యేడు. కాగా..

`96` రిలీజ్ అప్పుడేనా?

త‌మిళంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిన ల‌వ్‌స్టోరీ `96`. ప్రేమ్‌కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో దిల్‌రాజు రీమేక్ చేస్తున్నారు.

సీన్ రివర్స్ అశ్వత్థామపై తిరుగుబాటు.. భవిష్యత్తేంటో!?

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘంలో ముసలం మొదలైందా? తప్పు చేశామని.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ తమను మోసం చేశారని కార్మికులకు తెలిసొచ్చిందా..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కుర్రాడేనా!?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరికీ ఊహించిన దానికంటే ఎక్కువగానే సీట్లు వచ్చాయి.