ఇద్దరు ముద్దుగుమ్మలతో మాస్ మహారాజ..!
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజాకు క్రాక్ సక్సెస్ ఇచ్చిన కిక్‌తో మరింత స్పీడు పెరిగింది. ‘క్రాక్’ సినిమా విడుదల కాకముందే రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు రవితేజ. ‘క్రాక్’ బ్లాక్‌బస్టర్ అయ్యింది. దీంతో రవితేజకు మరింత డిమాండ్ పెరిగింది. ఇలా చెప్పడానికి కారణం.. ‘క్రాక్’ ముందు వరకు రవితేజకు హిట్స్ లేవు. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కాస్త వెనకా ముందు ఆలోచించారు. ఎప్పుడైతే క్రాక్ హిట్ అయ్యిందో ..రవితేజ మళ్లీ లైన్‌లో పడ్డాడు. దీంతో రెమ్యునరేషన్‌ను మరో ఐదారు కోట్లకు పెంచేశాడు. ఇప్పుడు సినిమాకు రవితేజ రూ.16 కోట్లు అడుగుతున్నాడని సమాచారం. అంత మొత్తమైతేనే సినిమాలు చేస్తానంటున్న రవితేజ.. అనౌన్స్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు త్రినాథరావు నక్కినతో. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కాంబినేషన్‌లో చేస్తున్నాడు.
తాజా సమాచారం మేరకు రవితేజ, త్రినాథరావు నక్కిన సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఓకే అయ్యారట. ఒకరు ఐశ్వర్యమీనన్ కాగా.. మరో అమ్మడు శ్రీలీల. 2012లో వచ్చిన లవ్ ఫెయిల్యూర్‌లో నటించిన ఐశ్వర్యమీనన్ మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. శ్రీలీల ఇప్పుడు పెళ్లి సందడి సినిమాలో నటిస్తుంది. ఇది ఆమెకు రెండో సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com