ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో మాస్‌  మహారాజ‌..!

  • IndiaGlitz, [Tuesday,February 23 2021]

మాస్ మ‌హారాజాకు క్రాక్ స‌క్సెస్ ఇచ్చిన కిక్‌తో మ‌రింత స్పీడు పెరిగింది. ‘క్రాక్’ సినిమా విడుద‌ల కాక‌ముందే ర‌మేశ్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ‘ఖిలాడి’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు ర‌వితేజ. ‘క్రాక్’ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. దీంతో ర‌వితేజ‌కు మ‌రింత డిమాండ్ పెరిగింది. ఇలా చెప్ప‌డానికి కార‌ణం.. ‘క్రాక్’ ముందు వ‌ర‌కు ర‌వితేజ‌కు హిట్స్ లేవు. దీంతో ఆయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు కాస్త వెన‌కా ముందు ఆలోచించారు. ఎప్పుడైతే క్రాక్ హిట్ అయ్యిందో ..ర‌వితేజ మ‌ళ్లీ లైన్‌లో ప‌డ్డాడు. దీంతో రెమ్యున‌రేష‌న్‌ను మ‌రో ఐదారు కోట్ల‌కు పెంచేశాడు. ఇప్పుడు సినిమాకు ర‌వితేజ రూ.16 కోట్లు అడుగుతున్నాడ‌ని స‌మాచారం. అంత మొత్త‌మైతేనే సినిమాలు చేస్తానంటున్న ర‌వితేజ‌.. అనౌన్స్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కినతో. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ కాంబినేష‌న్‌లో చేస్తున్నాడు.

తాజా స‌మాచారం మేర‌కు ర‌వితేజ‌, త్రినాథ‌రావు న‌క్కిన సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఓకే అయ్యార‌ట‌. ఒక‌రు ఐశ్వ‌ర్య‌మీన‌న్ కాగా.. మ‌రో అమ్మ‌డు శ్రీలీల‌. 2012లో వ‌చ్చిన ల‌వ్ ఫెయిల్యూర్‌లో న‌టించిన ఐశ్వ‌ర్య‌మీన‌న్ మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. శ్రీలీల ఇప్పుడు పెళ్లి సంద‌డి సినిమాలో న‌టిస్తుంది. ఇది ఆమెకు రెండో సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

More News

‘క్షణ క్షణం’తో మెప్పిస్తానంటున్న హీరో ఉదయ్ శంకర్

నిజ జీవితంలో గిన్నిస్ రికార్డ్ సాధించిన ఓ 15 ఏళ్ల బాలుడు.. తన స్కిల్‌ను మెరుగుపరుచుకోవడం కంటే ఎక్కువగా సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు.

రామ్ స‌ర‌స‌న ‘ఉప్పెన’ బ్యూటీ

తొలి చిత్రం ఉప్పెన‌తో శాండిల్‌వుడ్ బ్యూటీ కృతిశెట్టి తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది.

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

ఫోటోలోని వ్యక్తిని గుర్తించారా? షాక్ అవుతున్న నెటిజన్లు..

ఫోటోలోని వ్యక్తిని చూశారా? గుర్తు పట్టారా? ఆ ఎవరో ఒక రైతులే అనుకుంటున్నారా? లేదు..

టికెట్‌ ఫ్యాక్టరీ & ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్త నిర్మాణం... ప్రొడక్షన్‌ నెం1లో ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ముఖ్య తారలుగా టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు