రవితేజ తో పోటీపడుతున్న అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు. కె.కె.రాథామోహన్ నిర్మించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన బెంగాల్ టైగర్ చిత్రాన్ని నవంబర్ 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అందాల తార అనుష్క నటించిన చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కొవెలమూడి తెరకెక్కించారు. అనుష్క తో పాటు ఆర్య నటించిన సైజ్ జీరో సినిమాని పి.వి.వి సంస్థ తెలుగు,తమిళలో నిర్మించింది. ఈ చిత్రాన్ని కూడా నవంబర్ 27నే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి..ఈ పోటీలో ఇద్దరూ విజేతలుగా నిలుస్తారా..? లేక ఒకరే విజేతగా నిలుస్తారా అనేది తెలియాలంటే 27 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments