బిగ్ అప్డేట్: నిర్మాతగా మారిన రవితేజ.. తొలి చిత్రం షురూ!
Send us your feedback to audioarticles@vaarta.com
రవితేజ ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ నటుడిగానే తన పని తాను చేసుకుంటున్నాడు. హీరోనా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇన్నేళ్ల తన కెరీర్ లో రవితేజ మరో కొత్త అడుగు వేశాడు. నిర్మాతగా మారి సొంత బ్యానర్ స్థాపించాడు. వెంటనే తన ప్రొడక్షన్ లో సినిమా కూడా షురూ చేశాడు.
ఇదీ చదవండి: హైదరాబాద్ లో అడుగుపెట్టిన ధనుష్.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్!
వివరాల్లోకి వెళితే.. మాస్ మహారాజ్ రవితేజ 'రవితేజ టీం వర్క్స్(ఆర్ టి టీం వర్క్స్) పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించాడు. ఈ బ్యానర్ లో తొలి చిత్రం ప్రారంభమైపోయింది. శరత్ మండవ దర్శత్వంలో రవితేజ తన 68వ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రవితేజ కూడా ఒక నిర్మాత. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.
ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి, ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ లో రవితేజ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రవితేజ తొలిసారి నిర్మాతగా మారి నటిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి పెరిగింది. ఈరోజే హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సినిమా థీమ్ తెలియజేసే విధంగా ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు.
రవితేజ ఓ ప్రభుత్వ కార్యాలయంలో కుర్చీలో కూర్చుని ఉన్నాడు. తన ఉద్యోగ నిర్వహణ కోసం ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఈ పోస్టర్ చాలా డిఫెరెంట్ గా ఉంది. బలమైన సందేశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని అర్థం చేసుకోవచ్చు. రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు శరత్ మండవ ముందు నుంచి ఈ చిత్రంపై సూపర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నాజర్, నరేష్, పార్వతి లోకేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com