హాట్ టాపిక్ గా మారిన రవితేజ రెమ్యునరేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజ్ రవితేజ 'క్రాక్' చిత్రంతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు పరాజయాలతో డీలాపడ్డ రవితేజకు క్రాక్ మూవీ ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ చిత్రంలో నటిస్తున్నాడు.
ఇదీ చదవండి: జీవిత డేరింగ్ డెసిషన్.. ప్రకాష్ రాజ్, విష్ణుపై పోటీ?
ఖిలాడీతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో, త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో కూడా రవితేజ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా రవితేజ రెమ్యునరేషన్ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. క్రాక్ తర్వాత భారీ స్థాయిలో రవితేజ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.
సాధారణంగా రవితేజ సినిమాకు 10 నుంచి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటాడు. క్రాక్ బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ ఏకంగా 17 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. క్రాక్ మూవీ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనితో రవితేజ తన రెమ్యునరేషన్ రీజనబుల్ అని భావిస్తున్నాడేమో.
గతంలో కూడా రవితేజ రెమ్యునరేషన్ పై వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఖిలాడీ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout