అఫీషియల్‌.. రవితేజ 'ఖిలాడి'

  • IndiaGlitz, [Sunday,October 18 2020]

మాస్‌ మహారాజా రవితేజ 67వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి 'ఖిలాడి' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. రవితేజ బ్లాక్‌డ్రెస్‌లో స్టెప్‌ వేస్తుండగా అతని చుట్టూ డబ్బులు ఎగురుతున్నాయి. 'ప్లే స్మార్ట్‌' సినిమా ట్యాగ్‌లైన్‌. రవితేజ డ్యూయెల్‌ రోల్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని జయంతి లాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నవంబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సందర్భంగా ''ఖిలాడి సినిమా ఫస్ట్‌లుక్‌. మరో ఎగ్జయిటింగ్‌ జర్నీకి అంతా సిద్ధమైంది'' అని రవితేజ అన్నారు. ''ఖిలాడిలో ఇప్పటి వరకు కనిపించని రవితేజను చూస్తారు. అద్వితీయమైన టాలెంట్‌ ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు'' కావాలంటూ డైరెక్టర్‌ ట్వీట్‌ చేశారు. ''నా తదుపరి చిత్రం మాస్‌ మహారాజా రవితేజతో ఖిలాడి. సరికొత్త పాత్రలో కనిపించనున్నాం. గొప్ప టీమ్‌తో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. మీ ఆశీర్వాదాలు కావాలి'' అని డింపుల్‌ హయతి అన్నారు.