రవితేజ మూవీ టైటిల్ మళ్లీ మారిందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం బెంగాల్ టైగర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని నవంబర్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ ఓ మై ఫ్రెండ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాకి ఎవడో ఒకడు అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారం జరిగింది. ఆతర్వాత ఈ మూవీ టైటిల్ కోసం దిల్ రాజు భోగి అనే టైటిల్ రిజిష్టర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి ముందు అనుకున్న ఎవడో ఒకడు టైటిల్ నే కన్ ఫర్మ్ చేయనున్నారట. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com