బాలకృష్ణ కి పోటీగా రవితేజ?
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ బాలకృష్ణతో మాస్ మహారాజా రవితేజ మరోసారి పోటీపడనున్నాడా? అవుననే వినిపిస్తోంది టాలీవుడ్‌లో. కాస్త వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం బాలకృష్ణ జై సింహా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. సరిగ్గా అదే రోజున రవితేజ కొత్త చిత్రం టచ్ చేసి చూడు కూడా విడుదలయ్యే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ, రవితేజ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాంటి సందర్భాలున్నాయి. 2005లో అల్లరి పిడుగు, భగీరథ చిత్రాలు వారం గ్యాప్‌లో వస్తే.. 2008 సంక్రాంతి టైంలో ఒక రోజు గ్యాప్‌లో ఒక్క మగాడు, కృష్ణ చిత్రాలు వచ్చాయి. 2009 సమ్మర్‌లో మిత్రుడు, కిక్ వారం గ్యాప్‌లో వచ్చాయి. 2011 సంక్రాంతికి ఒక రోజు గ్యాప్‌లో పరమవీర చక్ర, మిరపకాయ్ వచ్చాయి. 2012 సమ్మర్‌లో దరువు, అధినాయకుడు వారం గ్యాప్‌లో వచ్చాయి.
ఇలా.. బాలయ్య, రవితేజ సినిమాలు పోటీపడిన ప్రతిసారి రవితేజకే బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో 2018 సంక్రాంతికి ఒకే రోజు రానున్న వీరి సినిమాలు ఎలాంటి ఫలితాలు అందుకుంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, పవన్ కళ్యాణ్ 25వ చిత్రం కూడా జనవరి 10న సంక్రాంతి కానుకగా రానున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments