మరోసారి డ్యూయెల్ రోల్‌లో రవితేజ
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హవీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నారట. వీర సినిమా తర్వాత రవితేజ, రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. వీర మూవీ డిజాస్టర్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత వీరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. విక్రమార్కుడు, రీసెంట్‌గా విడుదలైన డిస్కోరాజా వంటి చిత్రాల తర్వాత ఈ చిత్రంలో రవితేజ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు.
తాజాగా రవితేజ .. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న క్రాక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. డాన్‌శీను, బలుపు చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. బలుపు తర్వాత రవితేజ, శృతిహాసన్ జంటగా నటిస్తోన్న చిత్రమిది. సినిమాను మే 8న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments