రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ.. నిర్మాతలకు ఇబ్బంది తప్పదా?
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ అంటే ఫుల్ ఎనర్జీ అనే పేరుంది సినీ ఇండస్ట్రీలో. అందుకనే కొన్ని పవర్ఫుల్ పాత్రలను ఆయన చేసినంత ఎఫెక్టివ్‌గా మరెవరూ చేయలేరనిపిస్తుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా విడుదలైన క్రాక్ సినిమా. ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన క్రాక్ సినిమా యాబై కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో రవితేజ మార్కెట్ వేల్యూ మరింత పెరిగింది. దీన్ని రవితేజ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అందులో భాగంగా తన రెమ్యునరేషన్‌ను సగానికి పైగానే పెంచేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల మేరకు ఇప్పుడు రవితేజ కొత్తగా చేయబోతున్న సినిమాలకు పదహారు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను అడుగుతున్నాడట. ఇప్పటి వరకు పది కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడుగుతూ వచ్చిన రవితేజ.. క్రాక్ తర్వాత ఓకేసారి భారీగానే రెమ్యునరేషన్‌ను పెంచేశాడట. ఈ లెక్కలో చూస్తే ఇకపై మీడియం బడ్జెట్ చిత్రాలను రవితేజతో చేయడం కష్టమవుతుందనడంలో సందేహం లేదు. ఎవరైతే తను అడుగుతున్న రెమ్యునరేషన్ ఇస్తే వారితో సినిమా చేస్తానని రవితేజ కరాకండీగా ఉన్నాడట. మరి నిర్మాతలు ఇకపై రవితేజను అప్రోచ్ అవుతారా? లేక మరో హీరోను వెతుక్కుంటారో చూడాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout