ఆ హీరోయిన్స్‌కి రవితేజ హెల్ప్
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు హీరోయిన్స్‌కు సినిమాల్లో మంచి లైఫ్ టైమ్ ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ మంది హీరోయిన్స్ సినిమాల్లో పెద్దగా కంటిన్యూ కావడం లేదు. స్టార్ హీరోయిన్స్ కూడా ప్రేక్షకులను మెప్పించేలానే సినిమాలను యాక్సెప్ట్ చేయాలి. ఏ మాత్రం తేడా కొట్టినా ఇక సైడ్ అయిపోవాల్సిందే. కానీ కొందరు మాత్రమే రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంటారు. అలాంటి వారి విషయానికి వస్తే శ్రియా శరన్, ఇలియానా, శృతిహాసన్ ముగ్గురూ రీ ఎంట్రీ ఇచ్చినవారే. ఈ ముగ్గురుకి కామన్ విషయం ఒకటే. ఆ విషయమేమంటే.. మాస్ మహారాజా రవితేజ.
శ్రియా శరన్ విషయానికి వస్తే.. అగ్ర కథానాయకులందరితో కలిసి నటించిన ఈ అమ్మడు, ఓ దశలో గ్లామర్ పోటీలో వెనకబడింది. అయితే రవితేజతో చేసిన డాన్ శీను సక్సెస్ కావడంతో మరికొన్ని రోజులు శ్రియా శరన్ సక్సెస్‌ఫుల్‌గా అవకాశాలను దక్కించుకుంది. ఇక ఇలియానా విషయానికి వస్తే, దేవుడు చేసిన మనుషులు సినిమాతో తెలుగు సినిమా రంగానికి దూరమై బాలీవుడ్లో అవకాశాలను దక్కించుకునే ప్రయత్నాలు చేసినా, ఇలియానాకు పెద్ద బ్రేక్ రాలేదు. దీంతోపాటు ప్రేమ వ్యవహారంతోనూ ఇలియానా కొన్నాళ్ల పాటు సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే మళ్లీ రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని సినమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈసినిమా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. శ్రియ, ఇలియానా బాటలో రవితేజతో రీ ఎంట్రీ ఇచ్చి లక్ పరీక్షించుకోవాలనుకుంటున్నా మరో హీరోయిన్ శృతిహాసన్. ఈ చెన్నై బ్యూటీ రవితేజతో కలిసి క్రాక్ సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ప్రయత్నం ఆమెకు ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com