రవితేజ 68 అఫీషియల్ అనౌన్స్‌మెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ.. సంక్రాంతికి క్రాక్ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టిన ఈ హీరో ఆదివారం రోజున తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. రవితేజ నటిస్తోన్న 68వ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రసన్నకుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు భారీ మొత్తంలో రవితేజ రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు కూడా అందుకు ఓకే చెప్పేశారట. త్రినాథరావు కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడని టాక్.
క్రాక్‌తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టేసిన రవితేజ, తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రాన్ని జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com