రవితేజ67 లేటెస్ట్ అప్డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ ఏకధాటిగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాను రీస్టార్ట్ చేసిన మాస్‌రాజా, దాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని మేకర్స్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసినిమాకు సంబంధించిన దర్శకుడు రమేశ్ వర్మ లేటెస్ట్గా అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం పదకొండు గంటల యాబై ఐదు నిమిషాలుకు సినిమా ముహూర్తం, ఫస్ట్ లుక్కు సంబంధించిన అప్డేట్ను అనౌన్స్ చేయనున్నట్లు రమేశ్ వర్మ తెలిపారు.
ఏ స్టూడియోస్ ఎల్ఎల్పీ, పెన్ స్టూడియోస్ పతాకాలపై సినిమాను రూపొందనుంది. 2011లో రవితేజ, రమేశ్ వర్మ కాంబినేషన్లో వీర సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. కానీ గత ఏడాది రాక్షసుడు సినిమాతో సక్సెస్ సాధించిన రమేశ్ వర్మకు మరోసారి రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుంది. కాగా... ఈ చిత్రం తమిళ చిత్రం చతురంగవేట్టై సినిమాకు రీమేక్ అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా వక్కంతం వంశీ, త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలోనూ రవితేజ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com