పోలీసు విచారణలో కీలక విషయాలు చెప్పిన రవిప్రకాష్!?
Send us your feedback to audioarticles@vaarta.com
టీవీ9 వివాదంలో పరారీలో ఉన్న మాజీ సీఈవో రవిప్రకాష్ ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యాడు. ఇటు హైకోర్టు.. అటు సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో చేసేదేమీ లేక తానే స్వయంగా వచ్చి సైబరాబాద్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. కాగా.. రవి ప్రకాశ్ సంతకాలను ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తూ.. అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ వ్యవహారం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
కాగా.. ఈ కేసులో పలుమార్లు రవిప్రకాష్, గరుడ పురాణం శివాజీకి పలుమార్లు పోలీసులు నోటీసులిచ్చారు. అంతేకాదు ఆఖరికి లుక్ అవుట్ నోటీసులు కూడా పంపడం జరిగింది. అయితే పోలీసులకు కనిపించకుండా రవి, శివాజీ ఇద్దరూ అడ్రస్ లేకుండా పోయారు. కొన్ని రోజుల తర్వాత ముందస్తు బెయిల్ కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం.. ఆయనకు సూచించింది.
దీంతో చేసేదేమీ లేక మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యారు. రవిప్రకాశ్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంలో వాదనలు వినిపించగా.. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం జూన్ 10న విచారణ జరిపి ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు తేల్చిచెప్పింది. 41ఏ నోటీసు కింద విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌ను ఆదేశించింది. దీంతో రవిప్రకాష్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.
పోలీసులు ఏం అడిగారు..!?
ఇదిలా ఉంటే.. రవిప్రకాష్ పోలీసుల ఎదుట హాజరైన తర్వాత సమారు అరగంటపాటు ఆయన్ను పోలీసులు పలు విషయాలు సుధీర్ఘంగా విచారించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు రవిప్రకాష్ సమాధానాలివ్వగా.. కొన్నింటికి మాత్రం అస్సలు నోరు మెదపలేదట. దీంతో పోలీసులు మరోసారి రవిప్రకాష్‌ను సైబర్‌క్రైమ్‌కు రావాల్సి ఉంటుందని సూచించారని సమాచారం. అయితే శివాజీ గురించి రవిని అడగ్గా తనకు ఆయన గురించి తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రవిప్రకాష్‌ను విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఇంత వరకూ సైబర్‌క్రైమ్ పోలీసులుగానీ.. ఉన్నతాధికారులు కానీ మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా ఈ వివాదం మున్ముంథు మరింత ముదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com