గోపీతో బోజ్‌పురి నటుడు...

  • IndiaGlitz, [Wednesday,November 22 2017]

గోపీచంద్ క‌థానాయ‌కుడిగా చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న‌ సంగ‌తి తెలిసిందే. కె.కె.రాధామోహ‌న్ ఈ సినిమాను స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌పై నిర్మింబ‌చోతున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్‌తో పాటు మంచి మెసేజ్ ఉన్న సినిమాగా సినిమా తెర‌కెక్క‌నుంది.

డిసెంబ‌ర్ 16 నుండి సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో బోజ్‌పురి న‌టుడు ర‌వికిష‌న్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ట‌.

రేసుగుర్రం, కిక్‌2, సుప్రీమ్ వంటి చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించిన ర‌వికిష‌న్ ..ఇందులో కూడా స‌రికొత్త విల‌నిజాన్ని చూపించ‌బోతున్నాడ‌ట‌. ఈ చిత్రంలో మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

More News

ఎనిమిదోసారి అపూర్వ క‌ల‌యిక‌

మ‌న సీనియ‌ర్ హీరో హీరోయిన్స్‌..అంటే 80 ద‌శ‌కంలో న‌టించిన తారలంద‌రూ ఈ మ‌ధ్య ఏడాకి కలుసుకుంటారు. ఈ క‌ల‌యిక‌కి ఓ ప్ర‌దేశాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఈ గెట్ టుగెద‌ర్‌కి ఓ పేరు కూడా పెట్టుకున్నారు. ఆ పేరే '80స్ సౌత్ యాక్టర్స్ రీ యూనియున్'.

ప‌వ‌న్‌తో త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ ఆ ప‌ని చేయిస్తాడా?

జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు త‌ర్వాత ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు అజ్ఞాత‌వాసి అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది.

ఈసారి మ‌ల్టీస్టార‌ర్‌ తో

గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత హారీష్ శంక‌ర్ పేరు మారు మోగింది. అయితే రామ‌య్యా వ‌స్తావ‌య్య ప్లాప్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ స‌క్సెస్‌లు ఆ స్థాయి పేరుని హరీష్‌కి తెచ్చి పెట్ట‌లేదు.

నంది విష‌యంలో మీడియా అతి చేస్తుందంటున్న న‌టుడు...

హీరోగా వంద‌ల సినిమాల్లో న‌టించిన జ‌గ‌ప‌తి బాబు ఇప్పుడు విల‌న్‌గా,  క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చాలా బిజీగా ఉన్నాడు. ఈయ‌న ఈమ‌ధ్య వైజాగ్‌లో పాద‌యాత్ర చేశాడు.

దీపిక త‌ప్పుకుంది...

ప్ర‌స్తుతం ఇండియా మొత్తం విన‌ప‌డుతున్న పేరు దీపికా ప‌దుకొనే. ఈ హీరోయిన్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ప‌ద్మావ‌తి'. ఈ సినిమా వివాదాల‌తో కూరుకు పోయింది. విడుద‌ల కూడా వాయిదా ప‌డింది.