తను నేను రామ్మోహన్ ని గైడ్ చేసింది ఇతనే
- IndiaGlitz, [Wednesday,November 25 2015]
అష్టా చమ్మా, గోల్కండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా...ఇలా విభిన్న చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు రామ్మోహన్. తాజాగా తను నేను మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వర్షం, బాబీ, చంటి చిత్రాలను తెరకెక్కించి హఠాత్తుగా చనిపోయిన శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ని తను నేను మూవీతో హీరోగా పరిచయం చే్స్తున్నారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, అవికా జంటగా నటించారు.
ఈ సినిమాలో అవికా తండ్రి పాత్రను నటుడు, దర్శకుడు రవిబాబు పోషించారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో రవిబాబు డైరెక్టర్ రామ్మోహన్ కి చాలా సలహాలు ఇచ్చారట. కొన్ని సీన్స్ ఎలా తీయాలో గైడ్ చేసారట. ఇలాంటి విషయాల్ని జనరల్ గా బయటికి చెప్పరు. కానీ.. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ రామ్మోహన్ మీడియాకి చెప్పడం విశేషం.