Ravanasura;భూమ్మీద నన్నేవడైనా ఆపగలిగేవాడున్నాడంటే అది నేనే.. రవితేజ ఊరమాస్, రావణాసుర ట్రైలర్ వచ్చిందోచ్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజ్ రవితేజ మంచి జోష్‌లో వున్న సంగతి తెలిసిందే. ఆయన స్పీడ్‌కు కుర్రహీరోలు సైతం సైడ్ అవ్వాల్సిందే. గతేడాది కిలాడీ, రామారావ్ ఆన్‌డ్యూటీ, ధమాకా సినిమాలు థియేటర్‌లో దించిన రవితేజ.. సంక్రాంతికి చిరంజీవితో కలిసి వాల్తేర్ వీరయ్యతో సందడి చేశాడు. తాజాగా ఆయన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పాటు కార్తీక్ ఘట్టమనేని సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో రావణాసుర ఫస్ట్ వచ్చే అవకాశం వుంది. కెరీర్ ప్రారంభంలో నెగిటివ్ రోల్స్ చేసిన మాస్ మహారాజ్ మళ్లీ చానాళ్ల తర్వాత ఈ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రావణాసుర ట్రైలర్ విడుదల చేశారు.
నెగిటివ్ షేడ్స్‌లో రవితేజ క్యారెక్టర్:
టీజర్‌లో పెద్దగా ఏమి మెరుపులు లేకపోయినా.. ఓ క్రిమినల్ గురించి పోలీస్ డిపార్ట్‌మెంట్ చేసే సెర్చ్ ఆపరేషన్ చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఓ వైపు సాఫ్ట్ కనిపిస్తూనే, మరోవైపు నెగిటివ్ షేడ్‌లో రవితేజ నెక్ట్స్ లెవల్‌లో పర్ఫార్మెన్స్ చేసినట్లుగా కనిపిస్తోంది. ‘‘మర్డర్ చేయడం క్రైమ్, దొరక్కుండా చేయడం ఆర్ట్, ఐ యామ్ యాన్ ఆర్టిస్ట్’’, ‘‘ఈ భూమ్మీద నన్నేవడైనా ఆపగలిగేవాడున్నాడంటే అది నేనే’’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. రావణాసురలో రవితేజకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్ధుల్లాలు నటిస్తున్నారు. హీరోకు ఫ్రెండ్‌గా జబర్దస్త్ హైపర్ ఆది మరోసారి తన పంచ్‌లతో అలరించనున్నారు. జయరామ్, రావు రమేశ్, హీరో సుశాంత్‌లు కీలక పాత్రలు పోషించనున్నారు.
ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రావణాసుర:
అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గతంలో ధమాకాకు పనిచేసిన భీమ్స్ సిసిరోలియో , హర్షవర్ధన్ రామేశ్వర్‌లు స్వరాలు సమకూరుస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న రావణాసుర ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మాస్ మహారాజా నట విశ్వరూపాన్ని వెండితెరపై వీక్షించేందుకు రెడీగా వుండండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com