స్పెయిన్‌లో స్టెప్పులేస్తోన్న రామారావు
- IndiaGlitz, [Wednesday,March 09 2022]
మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఇప్పటికే ఖిలాడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన.. ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా వెంటనే షూటింగ్‌లకు హాజరవుతున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వలో తెరకెక్కుతోన్న ‘‘ధమాకా’’ చిత్రీకరణలో ఇటీవల ఆయన జాయిన్ అయ్యారు. దీని కంటే ముందే రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని రవితేజ విడుదలకు రెడీ చేశారు.
శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి మిగిలివున్న కొద్దిపాటి షూటింగ్‌ను పూర్తి చేసేందుకు రామారావు చిత్ర యూనిట్ ఫారిన్ వెళ్లినట్లుగా ఫిలింనగర్ టాక్. పాటల చిత్రీకరణ నిమిత్తం యూనిట్ స్పెయిన్ వెళ్లినట్లు సమాచారం. ఇక్కడి అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరిస్తోన్న పాటలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. కాగా.. దీనితో పాటు వంశీ తెరకెక్కిస్తున్న ‘‘టైగర్ నాగేశ్వరరావు’’. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘‘రావణాసుర’’ అనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్.