మెగా బ్రదర్స్ విలన్‌తో రవితేజ?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు 'దూకుడు', 'బాద్షా' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించి టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు దర్శకుడు శ్రీను వైట్ల. ఆ తర్వాత కాలం కలిసిరాక.. హ్యాట్రిక్ పరాజయాలతో బాగా వెనకపడిపోయారు. ప్రస్తుతం తనకు బాగా అచ్చొచ్చిన హీరోతో సినిమా చేసి.. గత వైభవాన్ని పొందాలని కృతనిశ్చయంతో ఉన్నారాయన.
ఈ నేపథ్యంలోనే రవితేజతో 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాకు శ్రీకారం చుట్టారు వైట్ల. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాలో రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ ఓ హీరోయిన్గా ఎంపికైంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం ఓ పవర్ఫుల్ విలన్‌ను కూడా ఎంపిక చేశారనే వార్త టాలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు 'ఖైదీ నంబర్ 150', 'కాటమరాయుడు' చిత్రాల్లో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తరుణ్ అరోరాను.. ఈ చిత్రంలో కూడా ప్రతినాయకుడిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com