రవితేజ 'టచ్ చేసి చూడు' షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. .బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా, సీరత్ కపూర్ నాయికలు.
నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ "మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. షూటింగ్ పూర్తయింది.ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది`` అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం : జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు,కేశవ్ , ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ, ఛాయాగ్రహణం : చోటా.కె.నాయుడు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com