రవితేజ సెకండ్ హీరోయిన్ ఎవరంటే....

  • IndiaGlitz, [Wednesday,January 25 2017]

బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ నెక్ట్స్ సినిమా చేయ‌డానికి ఏడాదికి పైగానే స‌మ‌యం తీసుకున్నాడు. ఈ గ్యాప్ తీసుకోవ‌డానికి ప‌లు కార‌ణాలున్నాయి. అనుకున్న విధంగా ప్రాజెక్ట్స్ సెట్ కాక‌పోవ‌డంతో 2016లో ర‌వితేజ సినిమా విడుద‌ల కానేలేదు. ఇప్పుడు రైట‌ర్ విక్ర‌మ్ సిరి ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంశీ నిర్మిస్తున్నారు. ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నిర్మాత‌లు ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
ఈ సినిమాకు ట‌చ్ చేసి చూడు అనే టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. అందులో రాశిఖ‌న్నా ఓ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే మ‌రో హీరోయిన్ పేరును నిర్మాత‌లు ఖ‌రారు చేయ‌లేదు. అయితే మ‌రో హీరోయిన్‌గా లావ‌ణ్య‌త్రిపాఠి న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమాకు దంగ‌ల్‌, ధూమ్ సిరీస్‌, బ‌ర్ఫీ, ఏ దిల్ హై ముష్కిల్ చిత్రాల‌కు సంగీతాన్ని స‌మ‌కూర్చిన ప్రీత‌మ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు మ‌రో సినిమాను నిర్మిస్తున్నాడు.

More News

రత్తాలుతో ఎన్టీఆర్ రొమాన్స్....

అధినాయకుడు,శివగంగ,చంద్రకళ,కాంచన సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన చెన్నై సొగసరి లక్ష్మీరాయ్ రీసెంట్ గా ఖైదీ నంబర్ 150చిత్రంలో

సూర్య సింగం 3 రిలీజ్ డేట్ వచ్చేసింది..!

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం సింగం 3.

ర‌వితేజ ట‌చ్ చేసి చూడు మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్..!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ట‌చ్ చేసి చూడు. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ తెర‌కెక్కిస్తున్నారు. ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రవితేజ కొత్త సినిమా టైటిల్ 'టచ్ చేసి చూడు'

'మాస్ మహారాజా' రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందనుంది.బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు

వెన‌క్కి లాగే వ్యాఖ్య‌లు చేయ‌కండి - ప‌వ‌న్ క‌ళ్యాణ్..!

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం యువ‌త‌కు పిలుపు నివ్వ‌టంతో ఈనెల 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో శాంతియుతంగా నిర‌స‌న తెలిపేందుకు రెడీ అవుతున్నారు.