రవితేజ టచ్ చేసి చూడు మోషన్ పోస్టర్ రిలీజ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టచ్ చేసి చూడు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ తెరకెక్కిస్తున్నారు. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ను ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రారంభించనున్నారు.
రేపు అనగా జనవరి 26 రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా లైట్ గెడ్డంతో స్టైల్ గా ఫోన్ పట్టుకున్నరవితేజ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా, దీపక్ రాజ్ స్ర్కీన్ ప్లే అందించారు. రవితేజ సంవత్సరంకు పైగా గ్యాప్ తరువాత వస్తున్న టచ్ చేసి చూడు విజయం సాధిస్తుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు రవితేజ టీమ్..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com