రవితేజకి మరోసారి తప్పని పోటీ
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొద్ది కాలంగా విజయాలకు దూరమైన మాస్ మహారాజా రవితేజ.. రాజా ది గ్రేట్`తో మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చారు. అయితే ఇటీవల విడుదలైన టచ్ చేసి చూడు` చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. రవితేజలాగే విజయాలకు దూరమైన యంగ్ హీరో నాగశౌర్య.. రవితేజ నటించిన టచ్ చేసి చూడు` చిత్రంతో పాటే ఛలో` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతేగాకుండా, ఈ చిత్రంతో తన కెరీర్లోనే పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు నాగశౌర్య. కట్ చేస్తే..
ఈ వేసవికి తన తదుపరి చిత్రం నేలటికెట్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు రవితేజ. వరుస హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 25న విడుదల కానుంది. విశేషమేమిటంటే.. ఈ సారి కూడా రవితేజ సినిమాతో పాటు మరో యువ కథానాయకుడి సినిమా విడుదల కాబోతోంది. అదే.. నాగ చైతన్య సవ్యసాచి`. చందు మొండేటి రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా మే 24న విడుదల కానుంది. మరి ఈ సారి కూడా యువ కథానాయకుడే సక్సెస్ అవుతాడో లేదంటే రవితేజకి సక్సెస్ వరిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments