సంక్రాంతికి రానున్న రవితేజ?
Send us your feedback to audioarticles@vaarta.com
బెంగాల్ టైగర్ తరువాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని.. ఇటీవలే రాజా ది గ్రేట్‌తో పలకరించాడు రవితేజ. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఈ సినిమాకి మంచి వసూళ్లే దక్కాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం టచ్ చేసి చూడు చిత్రంలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమాతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బెంగాల్ టైగర్‌లో ఓ హీరోయిన్గా నటించిన రాశి ఖన్నా.. ఈ సినిమా కోసం రవితేజతో రెండోసారి జోడీ కడుతోంది. మరో హీరోయిన్గా రన్ రాజా రన్, రాజుగారి గది2 ఫేమ్ సీరత్ కపూర్ నటిస్తోంది.
ఈ సినిమాని 2018 సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 25వ చిత్రం, బాలకృష్ణ జై సింహా సంక్రాంతి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు.. పవన్, బాలయ్యతో పాటు రవితేజ కూడా సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడన్నమాట. కృష్ణ, మిరపకాయ్ చిత్రాల రూపంలో రవితేజ కెరీర్లో కూడా రెండు సంక్రాంతి హిట్స్ ఉన్నాయి. మరి కలిసొచ్చిన సీజన్లో రవితేజ సందడి చేస్తాడో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments