సంక్రాంతికి రానున్న ర‌వితేజ‌?

  • IndiaGlitz, [Wednesday,November 01 2017]

బెంగాల్ టైగ‌ర్ త‌రువాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని.. ఇటీవ‌లే రాజా ది గ్రేట్‌తో ప‌ల‌క‌రించాడు ర‌వితేజ‌. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. ఈ సినిమాకి మంచి వ‌సూళ్లే ద‌క్కాయి. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ట‌చ్ చేసి చూడు చిత్రంలో న‌టిస్తున్నాడు ర‌వితేజ‌. ఈ సినిమాతో విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. బెంగాల్ టైగ‌ర్‌లో ఓ హీరోయిన్‌గా న‌టించిన రాశి ఖ‌న్నా.. ఈ సినిమా కోసం ర‌వితేజ‌తో రెండోసారి జోడీ క‌డుతోంది. మ‌రో హీరోయిన్‌గా ర‌న్ రాజా ర‌న్‌, రాజుగారి గ‌ది2 ఫేమ్ సీర‌త్ క‌పూర్ న‌టిస్తోంది.

ఈ సినిమాని 2018 సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ని టాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ చిత్రం, బాల‌కృష్ణ జై సింహా సంక్రాంతి బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు.. ప‌వ‌న్‌, బాల‌య్య‌తో పాటు ర‌వితేజ కూడా సంక్రాంతి బ‌రిలోకి దిగుతున్నాడ‌న్న‌మాట‌. కృష్ణ‌, మిర‌ప‌కాయ్ చిత్రాల రూపంలో ర‌వితేజ కెరీర్‌లో కూడా రెండు సంక్రాంతి హిట్స్ ఉన్నాయి. మ‌రి క‌లిసొచ్చిన సీజ‌న్‌లో ర‌వితేజ సంద‌డి చేస్తాడో లేదో చూడాలి.

More News

విజయ్ దేవరకొండతో పవన్ డైరెక్టర్ ?

పెళ్లిచూపులుతో సోలో హీరోగా తొలి హిట్ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన అర్జున్ రెడ్డితోనే పరిశ్రమ దృష్టిలో పడ్డాడు ఈ యువ కథానాయకుడు.

ప‌వ‌న్ హీరోయిన్‌.. ఒకే రోజు రెండు చిత్రాలు

మ‌జ్ను (2016) చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కేర‌ళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్‌. ఆ త‌రువాత కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌తో ప‌ల‌క‌రించిన ఈ చిన్న‌ది.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జోడీగా అత‌ని 25వ చిత్రంలో న‌టిస్తోంది.

'క్వీన్' నుంచి తప్పుకుంది

బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్. 2014లో విడుదలైన ఈ సినిమాలో కంగనారనౌత్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఇప్పుడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

మెట్రో స్మార్ట్ కార్డు ధరెంతో తెలుసా ?

3 కారిడార్లలో నిర్మిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరానికి తలమానికం కానుంది. నాగోల్ - మెట్టుగూడ 8 కిలో మీటర్ల మార్గం రెండేళ్ల క్రితమే పూర్తయ్యింది.

కాంగ్రెస్ గూటికి రేవంత్

ఎట్టకేలకు రేవంత్ కాంగ్రెస్ గూటికి చేరారు. తెలుగు దేశం పార్టీ పదవులకు, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన నేడు రాహుల్ గాంధీ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.